కోపంతో లగ్జరీ కార్లు బద్దలు కొట్టేసుకున్నారు
బీజింగ్: ఇద్దరు భార్యభర్తల మధ్య కోపం వస్తే ఏం జరుగుతుంది. ఈమె నాలుగు మాటలంటుంది.. ఆయన మాటలంటాడు. కొంత కోపిష్టి భర్తయితే చేతివాటం చూపిస్తాడు. అదే భార్యకు కోపం ఎక్కువయితే, ఇంట్లో వస్తువులు గాల్లో లేస్తాయి. అవసరం అయితే, భర్తపై రాళ్ల మాదిరి పడతాయి. కానీ, తీవ్ర ఆగ్రహావేశానికి లోనయిన ఇద్దరు చైనా భార్యభర్తలు ఏం చేశారో తెలుసా.. ఏకంగా వారి లగ్జరీ కార్లను బద్ధలు కొట్టేసుకున్నారు. అసలు విషయానికి వస్తే వారిద్దరు ఈ మధ్యే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా ఆస్తి పంపకాల వంతొచ్చింది. అయితే, ఆ పంపకాల విషయంలో తేడా వచ్చింది. చెరొకమాట అనుకున్నారు.
ఆ తర్వాత తీవ్ర కోపానికి లోనైన భార్య తన బీఎండబ్ల్యూ కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ, భర్త తన బ్లాక్ మెర్సిడీస్ కారుతో ఆమెను వెంబడించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో ఆమె కారు ధ్వంసం అయింది. దీంతో చిర్రెత్తిన భార్య నా కారే ధ్వంసం చేస్తావా అని అతడి కారుపై కూడా దాడి చేసి బద్ధలు కొట్టేసింది.