మూడో రౌండ్‌లో శరత్ | Image for the news result Sharath Kamal Moves Into Round Three at World Table Tennis Championship | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో శరత్

Published Thu, Apr 30 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

మూడో రౌండ్‌లో శరత్

మూడో రౌండ్‌లో శరత్

సుజౌ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ దూసుకెళుతున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 44వ ర్యాంకర్ శరత్ కమల్ 11-4, 11-5, 11-7, 6-11, 11-8 తేడాతో 35వ ర్యాంకర్ సైమన్ గాజీ (ఫ్రాన్స్)ని మట్టికరిపించాడు. గతంలోనూ తను ఈ మెగా టోర్నీలో మూడో రౌండ్ వరకు చేరాడు. అలాగే జి.సత్యన్ సంచలన ప్రదర్శన రెండో రౌండ్‌లో ముగిసింది.

అతను 1-4తో చైనాకు చెందిన ఫాంగ్ బో చేతిలో ఓడిపోయాడు. అటు సౌమ్యజిత్ ఘోష్ కూడా రెండో రౌండ్‌లో 1-4తో అలెగ్జాండర్ (రష్యా) చేతిలో ఓడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement