
స్లొవేకియా ఓపెన్ చాంప్ ఐహిక
న్యూఢిల్లీ: స్లొవేకియా ఓపెన్ గ్లోబర్ జూనియర్ సర్క్యూట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఐహిక ముఖర్జీ విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి సెనెక్‌లో జరిగిన ఫైనల్లో ఐహిక 4-2 (11-6, 9-11, 11-4, 6-11, 13-11, 11-6) లీలా ఇమ్రే (హంగేరి)పై గెలిచింది. 40 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ముఖర్జీకి ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే పోలిష్ జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో ముఖర్జీతో పాటు ఇతర భారత ఆటగాళ్లు పాల్గొననున్నారు.