మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మనవాళ్ల ప్రతిభ అంతంతమాత్రమే. అందునా మహిళల నుంచి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌లో బరిలోకి దిగేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎంఎంఏ అనేది సాధారణమైన రెజ్లింగ్ కాదు. పటిష్టమైన దేహదారుడ్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది.
మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో పాటుగా అటు బాక్సింగ్.. ఇటు రెజ్లింగ్‌ను కలగలిపి ఈ క్రీడను ఆడాల్సి ఉంటుంది. గేమ్‌లో శరీరంలో ఏ భాగంలోనైనా పంచ్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి నడుము కింది భాగంలో దాడి చేయడం నిషేధం. అందుకే మొహాలు, ముక్కులు పగిలి రక్తాలు కారడం చూస్తుంటాం. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఆటగాళ్లు కోమాలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ఇక మన దేశం నుంచి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మహిళల నుంచి వెలుగులోకి వచ్చింది రీతు ఫోగట్ మాత్రమే. మహవీర్ ఫోగట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె తొలుత రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ పడింది. ఆ తర్వాత ఎంఎంఏ ఫైట్‌పై ఉన్న ఆసక్తి రీతు ఫోగాట్‌ను MMA Star ఫైటర్‌గా మార్చింది. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆడపులి ప్రవేశించింది. ఆమె పేరే పూజా తోమర్. ఎంఎంఏ ఫైటర్‌గా దేశం తరపున స్టార్ హోదా పొందిన ఈమె తాజాగా ఎంఎఫ్‌ఎన్(Matrix Night Fight) టైటిల్ గెలిచి ఔరా అనిపించింది.
జూలై 2న(ఆదివారం) ఇండోర్ వేదికగా జరిగిన MFN12(Matrix Night Fight) టైటిల్ పోరులో పూజా తోమర్ చాంపియన్‌గా నిలిచింది. రష్యాకు చెందిన మాజీ చాంపియన్ అనస్థిషియా ఫెఫనోవాను బౌట్‌లో ఓడించి స్ట్రావెయిట్ చాంపియన్‌గా అవతరించింది. మొత్తం నాలుగు రౌండ్లలో జరిగిన ఫైట్‌లో ఏ దశలోనూ పూజా తోమర్ తగ్గింది లేదు. ప్రతీ రౌండ్‌లో తన ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది.
నాలుగో రౌండ్‌కు వచ్చేసరికి అనస్థిషియా ఇక ఆడలేనంటూ పక్కకు తప్పుకోవడంతో పూజా తోమర్ విజేతగా నిలిచినట్లు రిఫరీ ప్రకటించారు. ఆమె ప్రదర్శనను టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా వీక్షించారు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్, శిఖర్ ధావన్‌లు గేమ్ ముగిసిన అనంతరం ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందించారు.
Hard work pays off😊💪
— puja tomar (@pujatomar19) July 2, 2023
Thanks to @mfn_mma @ayeshashroff @kishushroff for the opportunity. Thanks to my coach @thefighterscoach for motivating and guiding me. Thanks to my Family and Friends for supporting me. Thanks to my Fans for all their love, support and care.
@somafightclub pic.twitter.com/zqfL0WQ9CH
చదవండి: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు'
#Ben Stokes: స్టోక్స్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా పత్రిక.. ఫోటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment