MMA star
-
తొలి ఎమ్ఎమ్ఎ ఫైటర్‌గా రికార్డు.. ఎవరీ పూజా తోమర్?
భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పూజా తోమర్ రికార్డులకెక్కింది. లూయిస్విల్లే వేదికగా శనివారం జరిగిన గేమ్‌లో బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను 30-27, 27-30, 29-28 తేడాతో ఓడించి పూజా విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ప్రత్యర్ధిపై పూజా పై చేయి సాధించగా.. రెండో రౌండ్లో మాత్రం అమండా డోస్ శాంటోస్ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి పూజా వరుస కిక్‌లతో అమండా డోస్ శాంటోస్‌ను వెనక్కి నెట్టింది. దీంతో మూడు రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న పూజా.. యూఎఫ్‌సీ ఛాంపియన్‌గా నిలిచింది.ఎవరీ పూజా?28 ఏళ్ల పూజా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించింది. పూజా వుషు( చైనీస్ యుద్ధ కళ)తో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని పూజా ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంట్రీ ఇచ్చింది. HISTORY CREATED BY PUJA TOMAR. 🇮🇳- She becomes the first ever Indian woman to win the UFC match. pic.twitter.com/j4PkN04z8k— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024 -
ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మనవాళ్ల ప్రతిభ అంతంతమాత్రమే. అందునా మహిళల నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌లో బరిలోకి దిగేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎంఎంఏ అనేది సాధారణమైన రెజ్లింగ్ కాదు. పటిష్టమైన దేహదారుడ్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో పాటుగా అటు బాక్సింగ్.. ఇటు రెజ్లింగ్‌ను కలగలిపి ఈ క్రీడను ఆడాల్సి ఉంటుంది. గేమ్‌లో శరీరంలో ఏ భాగంలోనైనా పంచ్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి నడుము కింది భాగంలో దాడి చేయడం నిషేధం. అందుకే మొహాలు, ముక్కులు పగిలి రక్తాలు కారడం చూస్తుంటాం. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఆటగాళ్లు కోమాలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మహిళల నుంచి వెలుగులోకి వచ్చింది రీతు ఫోగట్ మాత్రమే. మహవీర్ ఫోగట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె తొలుత రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీ పడింది. ఆ తర్వాత ఎంఎంఏ ఫైట్‌పై ఉన్న ఆసక్తి రీతు ఫోగాట్‌ను MMA Star ఫైటర్‌గా మార్చింది. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆడపులి ప్రవేశించింది. ఆమె పేరే పూజా తోమర్. ఎంఎంఏ ఫైటర్‌గా దేశం తరపున స్టార్ హోదా పొందిన ఈమె తాజాగా ఎంఎఫ్ఎన్(Matrix Night Fight) టైటిల్ గెలిచి ఔరా అనిపించింది. జూలై 2న(ఆదివారం) ఇండోర్ వేదికగా జరిగిన MFN12(Matrix Night Fight) టైటిల్ పోరులో పూజా తోమర్ చాంపియన్‌గా నిలిచింది. రష్యాకు చెందిన మాజీ చాంపియన్ అనస్థిషియా ఫెఫనోవాను బౌట్లో ఓడించి స్ట్రావెయిట్ చాంపియన్‌గా అవతరించింది. మొత్తం నాలుగు రౌండ్లలో జరిగిన ఫైట్‌లో ఏ దశలోనూ పూజా తోమర్ తగ్గింది లేదు. ప్రతీ రౌండ్లో తన ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. నాలుగో రౌండ్‌కు వచ్చేసరికి అనస్థిషియా ఇక ఆడలేనంటూ పక్కకు తప్పుకోవడంతో పూజా తోమర్ విజేతగా నిలిచినట్లు రిఫరీ ప్రకటించారు. ఆమె ప్రదర్శనను టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా వీక్షించారు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్, శిఖర్ ధావన్‌లు గేమ్ ముగిసిన అనంతరం ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. Hard work pays off😊💪 Thanks to @mfn_mma @ayeshashroff @kishushroff for the opportunity. Thanks to my coach @thefighterscoach for motivating and guiding me. Thanks to my Family and Friends for supporting me. Thanks to my Fans for all their love, support and care. @somafightclub pic.twitter.com/zqfL0WQ9CH — puja tomar (@pujatomar19) July 2, 2023 చదవండి: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #Ben Stokes: స్టోక్స్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా పత్రిక.. ఫోటో వైరల్ -
అతనో పెద్ద కమెడియన్.. పట్టించుకోకండి!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఆయన అంతేవాసులైన రిపబ్లికన్లు సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అమెరికాలోని ముస్లింలలో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తోంది. అవకాశాల స్వర్గమైన అగ్రరాజ్యంలో తాము ఏకాకులమైన భావనను ట్రంప్ డప్పు కొట్టిమరీ చేస్తున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ లో జన్మించి.. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ బాక్సర్ బషీర్ అహ్మద్ ట్రంప్ ప్రచారంపై స్పందించాడు. 'ట్రంప్ లాంటివాళ్లు మాట్లాడితే వింటే నాకు కామెడీ లాగా అనిపిస్తుంది' అని ఆయన పేర్కొన్నాడు. అమెరికా సైన్యంలో చేరి ఆఫ్గనిస్థాన్ లోనూ జవాన్ గా పనిచేసిన ఆయన మాట్లాడుతూ అమెరికా మూక సంస్కృతిని ట్రంప్ కంట్రోల్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆయన ప్రచార సరళీ మొత్తం ఇలాగే ఉందని, ముస్లింలను ఎవరూ ఎక్కువ ద్వేషిస్తారు? అన్న రీతిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆసియా వన్ చాంపియన్ షిప్ లో పాకిస్థాన్ తరఫున ఎంఎంఏ ఫైటర్ గా పాల్గొంటున్న బషీర్ అహ్మద్ తాను గ్లోబల్ పౌరుడినని, అయినప్పటికీ ట్రంప్ తీరు అమెరికాలోని ముస్లింలకు ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.