
భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పూజా తోమర్ రికార్డులకెక్కింది.
లూయిస్‌విల్లే వేదికగా శనివారం జరిగిన గేమ్‌లో బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను 30-27, 27-30, 29-28 తేడాతో ఓడించి పూజా విజేతగా నిలిచింది. తొలి రౌండ్‌లో ప్రత్యర్ధిపై పూజా పై చేయి సాధించగా.. రెండో రౌండ్‌లో మాత్రం అమండా డోస్ శాంటోస్ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో రౌండ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు.
అయితే ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి పూజా వరుస కిక్‌లతో అమండా డోస్ శాంటోస్‌ను వెనక్కి నెట్టింది. దీంతో మూడు రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న పూజా.. యూఎఫ్‌సీ ఛాంపియన్‌గా నిలిచింది.
ఎవరీ పూజా?
28 ఏళ్ల పూజా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించింది. పూజా వుషు( చైనీస్ యుద్ధ కళ)తో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని పూజా ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంట్రీ ఇచ్చింది.
HISTORY CREATED BY PUJA TOMAR. 🇮🇳
- She becomes the first ever Indian woman to win the UFC match. pic.twitter.com/j4PkN04z8k— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024