
టెన్నికాయిట్ జట్ల ఎంపిక
హైదరాబాద్: సౌత్ జోన్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపికచేశారు. జాతీయ టెన్నికాయిట్ సమాఖ్య కార్యదర్శి లక్ష్మీకాంతం ఈ టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగనుంది.
పురుషుల జట్టు
ఎన్. రాకేశ్, డి. వెంకటేశ్, ఎస్. సందీప్, ఎన్. ప్రవీణ్, మొహమ్మద్ యాసీన్, బి. చందర్
మహిళల జట్టు
బి. ప్రియాంక, కె. శిరీష, ఎం. హేమలత, వి. నర్మద, వై. అర్చన, డి. అనూష