వన్ మైల్ రన్ విజేత క్రాంతి | One Mile Run, winner of the Kranti | Sakshi
Sakshi News home page

వన్ మైల్ రన్ విజేత క్రాంతి

Published Mon, Sep 9 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

One Mile Run, winner of the Kranti

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ గోల్డన్ మైల్ రన్ (వన్ మైల్) చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఎస్. క్రాంతి కిరణ్ (సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) విజేతగా నిలిచాడు. పోటీని అతను 4:43.1 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. సయ్యద్ వజీర్ (అవంతి కాలేజి) రజత పతకం గెలుచుకోగా, సయ్యద్ అహ్మదుల్లా (అవంతి కాలేజి) కాంస్యం దక్కించుకున్నాడు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ మైదానంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. విజేతలకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు పతకాలను అందజేశారు.
 
 ఫైనల్ ఫలితాలు: అండర్-16 బాలుర విభాగం: 1.వి. శ్రీనివాస్ (జెడ్‌పీ హైస్కూల్, మేకగూడ), 2. టి.మితిష్ (హెచ్‌పీఎస్, రామంతాపూర్), 3. ఎం.తవస్య(జెడ్‌పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలురు: 1.ఎం.గణేష్ (జెడ్‌పీ హైస్కూల్, మేకగూడ), 2. కె.శ్రీధర్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రాజురెడ్డి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-10 బాలురు: 1.చంద్ర నాయక్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 2.సాయి కుమార్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రామ్ గౌడ్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-16 బాలికలు: 1.పి.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్), 2. కలైవాణి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. సి.లక్ష్మి (జెడ్‌పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలికలు: 1. అనూష (జెడ్‌పీ హైస్కూల్, మేకగూడ), 2. పి.మమత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement