
బాల్ బ్యాడ్మింటన్ చాంప్ తెలంగాణ
విజయవాడ స్పోర్ట్స్: చుక్కపల్లి పిచ్చయ్య స్మారక జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ తెలంగాణ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్స్‌లో తెలంగాణ జట్టు 25-29, 29-20, 29-6 తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు 14-29, 29-25, 29-17 తేడాతో కర్ణాటక జట్టుపై విజయం సాధించింది.