ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిం దో తెలియదుగానీ.. మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఓ మానసిక వికలాంగురాలు రెండేళ్ల చిన్నారితో కనిపించింది.
మల్యాల, న్యూస్‌లైన్ : ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిం దో తెలియదుగానీ.. మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఓ మానసిక వికలాంగురాలు రెండేళ్ల చిన్నారితో కనిపించింది. చిన్నారితో కలిసి అటుఇటు తిరుగుతుండడాన్ని గమనించిన ఆటోడ్రైవర్లు వివరా లు ఆరా తీసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి తీసుకెళ్లారు. చిన్నారితోపాటు తల్లికి ఆహారం అందించారు. సీడీపీవో విజయలక్ష్మి తల్లీబిడ్డలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. అనంతరం పేపరు, పెన్ను ఇవ్వగా.. తన పేరు యు.దీపిక అని, భర్తపేరు లక్ష్మణ్, పాప పేరు శివాని అని, తమది నిజామాబాద్ జిల్లా వర్ని సమీపంలోని రణపెల్లి గ్రామమని రాసింది. అనంతరం ఇద్దరినీ స్వధార్ హోంకు పంపించారు.
తల్లడిల్లిన తల్లిప్రేమ..
మతిస్థిమితం కోల్పోయినా ఆ మహిళ తన కూతురు కాసేపు కనిపించకపోవడంతో తల్లడిల్లింది. ఆమె వివరాలు తెలుసుకునే క్రమంలో ఆటోడ్రైవర్లు ఆమె వద్దనున్న చిన్నారిని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి బయటకు తీసుకెళ్లా రు. దీంతో ఆ తల్లి కాసేపు కంగారుపడింది. బ యటకు పరుగెత్తి వెదికింది. కొద్దిసేపటికి కూతురును తీసుకురావడంతో ఊపిరిపీల్చుకుంది. పాపను పెంచుకునేందుకు ఓ మహిళ ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మిని బతిమాలింది.