గర్గావ్: నగర పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ సీఎన్జీ ఆటోడ్రైవర్లు చేస్తున్న ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది.
కొనసాగుతున్న ఆటోడ్రైవర్ల పోరు
Published Thu, Oct 3 2013 1:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
గర్గావ్: నగర పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ సీఎన్జీ ఆటోడ్రైవర్లు చేస్తున్న ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. అడ్డగోలుగా చలాన్లు రాస్తుండడం, ఎక్కడపడితే అక్కడ ఆపి ఇబ్బందులకు గురిచేస్తుం డడంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా మంగళవారం సీఎన్జీ ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. ఇది కొంత ఉద్రిక్త పరిస్థితికి కూడా దారి తీసింది. అయితే బుధవారం మాత్రం ఆటోడ్రైవర్లు శాంతియుతంగానే ఆందోళనను కొనసాగించారు. తమ డిమాండ్లను పోలీస్ కమిషనర్ అలోక్ మిట్టల్ ముందుకు మళ్లీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కమిషనర్ నుంచి డ్రైవర్లకు ఆశించి న సమాధానం దక్కలేదు.
చలాన్లు రాయడం, అక్రమంగా తిప్పుతున్న ఆటోలను అడ్డుకోవడం వంటివి ఇకపై కూడా కొనసాగుతాయని అలోక్ మరోసారి స్పష్టం చేశారు. డ్రైవర్ల డిమాండ్లు న్యాయసమ్మతమైన డిమాండ్లు కావని, వాటిని అం గీకరించే పరిస్థితే లేదన్నారు. డ్రైవ్‌ను ఎదుర్కొనేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని, చలాన్లు చెల్లించకుండా ఉండాలంటే అన్ని రకాల అనుమతులు తీసుకొని, సక్రమంగా ఆటోలు నడుపుకోవాలని హెచ్చరించారు. లేదంటే ఇబ్బందులు తప్పవన్నారు.
గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు కూడా కమిషనర్‌తో మాట్లాడినా ఎటువంటి ఫలి తం లేకపోయింది. మరోపక్క ఆటోడ్రైవర్లు కూడా తమ ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు. విచారణ పేరుతో వేధించడం, అన్ని రకాల అనుమతులు ఉన్నా కూడా చలాన్లను రాస్తున్నారని, ఈ చలాన్ డ్రైవ్‌ను ఆపే వరకు తాము ఆందోళనను విరమించే ప్రసక్తే లేదంటున్నారు.
Advertisement
Advertisement