టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ-చలాన్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కృష్ణలంక జాతీయ రహదారిపై ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.