ఆటో రిక్షాలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. నేటి (మంగళవారం) నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్ ఎన్‌కంబర్డ్) ఖాతాను తెరవాలి.