ఆటోవాలాలూ.. అవినీతి పోలీసులను పట్టించండి | Trap corrupt policemen, Kejriwal tells auto drivers rally | Sakshi
Sakshi News home page

ఆటోవాలాలూ.. అవినీతి పోలీసులను పట్టించండి

Published Thu, Jul 31 2014 4:24 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ఆటోవాలాలూ.. అవినీతి పోలీసులను పట్టించండి - Sakshi

ఆటోవాలాలూ.. అవినీతి పోలీసులను పట్టించండి

ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా లంచాలు అడిగితే వాళ్ల గొంతులు రికార్డు చేయడం ద్వారా పట్టించాలని ఆటో డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా లంచాలు అడిగితే వాళ్ల గొంతులు రికార్డు చేయడం ద్వారా పట్టించాలని ఆటో డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. చిన్న స్థాయి స్టింగ్ ఆపరేషన్ చేయాలని, ఎవరైనా లంచాలు అడిగినా, అక్రమంగా చలానా రాసినా ఆ విషయాన్ని వీడియో తీయడం లేదా కనీసం మాట రికార్డు చేయడం లాంటివి చేయాలని ఆయన ఆటోడ్రైవర్ల ర్యాలీలో తెలిపారు. ఢిల్లీలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతిపరులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రాంలీలా మైదాన్లో వేలాదిమంది ఆటోడ్రైవర్లతో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఢిల్లీ జీవరేఖగా ఉన్న ఆటోడ్రైవర్లను వేధించడం మానుకోవాలని మాజీ మంత్రి మనీష్ సిసోదియా పోలీసులను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనా సమయంలో తమను పోలీసులు వేధించలేదని, వాళ్లను మళ్లీ అధికారంలోకి తేవాలనుకుంటున్నామని ఓ ఆటోడ్రైవర్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement