అనంతపురం: ఓ యువతిని ఐదుగురు ఆటో ద్రైవర్లు గత కొంత కాలం నుంచి ఎంతగానో వేధిస్తున్నారు. చివరికి పోలీసుల చేతికి చిక్కేసరికి కేసుల భయంతో ఆత్మహత‍్యాయత్నం చేశారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక చంద్రబాబు నగర్‌కు చెందిన ఓ యువతిని ఐదుగురు ఆటోడ్రైవర్లు కొంతకాలం నుంచి వేధింపులకు గురిచేస్తున్నారు. బాధిత యువతి ఈవ టీజింగ్ చేసిన ఐదుగురిపై ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో ఆ యువతిని ఆటో డ్రైవర్లు ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇదివరకే యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఐదుగురినీ గత మూడు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసుల భయంతో వారు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఐదుగురు ఈవ్ టీజర్లు ఆత్మహత్యాయత్నం!
Published Fri, Jun 2 2017 8:02 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement