కామాంధుడికి దేహశుద్ధి | Eve-teaser thrashed | Sakshi
Sakshi News home page

కామాంధుడికి దేహశుద్ధి

Published Thu, Apr 24 2014 9:14 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

Eve-teaser thrashed

అనంతపురం జిల్లాలో బస్సులో మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి దేహశుద్ధి చేశారు తోటి ప్రయాణికులు. ఒళ్లు హూనం చేసిన తర్వాత ఆ ఘనుడిని పోలీసులకు అప్పగించారు.

జమ్మలమడుగు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లెగ్జరీలో వైఎస్సార్‌జిల్లాకు  చెందిన దంపతులు ప్రయాణిస్తున్నారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న కర్నాటకకు చెందిన శంకర్‌ అనే వ్యక్తి బస్సులోని ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఈ విషయంపై భర్తకు తెలియచేసింది. కొంతసేపు ఓపిక పట్టిన ఆమె భర్త.. బస్సు కదిరి బస్టాండ్‌కు రాగానే శంకర్ కి బాగా దేహశుద్ది చేశాడు. తోటి ప్రయాణికులు సైతం తలో చేయివేసి అతగాడికి కామశుద్ధి చేశారు.

ఆ తరువాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు నందుకున్న కదిరి పోలీసులు నిందితుడిపై నిర్భయచట్టం కింద కేసునమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement