జోగిపేట (మెదక్) :ఆర్టీఏ, పోలీసుల వేధింపులకు నిరసనగా మెదక్ జిల్లా జోగిపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. రవాణా, పోలీసు శాఖలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ కార్యదర్శి, ఆటో డ్రైవర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు మొగులయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రైవర్లందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి ఏడాది కావస్తున్నా కార్యరూపం దాల్చలేదన్నారు.
ఆర్టీసీ డీఎం... ఆర్‌టీఏ అధికారులను ఉసి గొలిపి ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు కూడా వారానికి రెండు సార్లు జరిమానాల పేరుతో రూ.200 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
అధికారులు వేధిస్తున్నారంటూ ఆటోడ్రైవర్ల ధర్నా
Published Mon, Dec 14 2015 6:27 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement
Advertisement