సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్‌లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.
2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్‌గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్‌కు ఇంజనీర్లు తెలిపారు.
ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’
వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్‌కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్‌మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.
అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment