సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను లగచర్ల దాడి కేసు బాధితలు శనివారం కలిశారు. పోలీసుల దాడిపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదన్నారు. రైతుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.
త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామమని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. దోషులను కమిషన్ వదిలిపెట్టదని.. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
కాగా, కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment