ST SC
-
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను లగచర్ల దాడి కేసు బాధితలు శనివారం కలిశారు. పోలీసుల దాడిపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదన్నారు. రైతుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామమని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. దోషులను కమిషన్ వదిలిపెట్టదని.. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.కాగా, కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 34% రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. 2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వు స్థానాలు గుర్తించేది ఇలాగే.. ►రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ కేటగిరికి చెందిన ఓటర్ల వివరాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ►జడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా.. జడ్పీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్‌గాను.. ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల యూనిట్‌గానూ.. వార్డు సభ్యుల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ యూనిట్‌గా తీసుకుంటారు. యూనిట్‌గా అంటే ఆ ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కలు లేదా ఓటర్ల వివరాల మేరకు జరుగుతుంది. ►మండల పరిషత్ అధ్యక్ష పదవులకు అయితే.. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌లు ఉండగా, ఏ జిల్లాకు ఎన్ని మండలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల కింద కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించి, ఆయా జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తారు. కలెక్టరు ఆ జిల్లాలో ఏ మండలం ఏ కేటగిరికి రిజర్వు చేసేది నిర్ణయిస్తారు. ►జడ్పీటీసీ పదవులకు అయితే.. ఆ జిల్లాలో ఉండే మొత్తం పదవులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన (ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6,77 శాతం, బీసీలకు 34 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరి) మేరకు జిల్లా కలెక్టరే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ►ఎంపీటీసీ పదవులకు అయితే.. జిల్లాలో ఉండే మొత్తం పదవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఏ కేటగిరికి ఎన్ని పదువుల కేటాయించాలన్నది నిర్ణయిస్తే.. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఉన్న స్థానాలను ఏ కేటగిరికి ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ►ఇక సర్పంచి పదవులను జిల్లాల వారీగా ఎన్ని కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఏఏ పంచాయతీలను ఏఏ కేటగిరికి కేటాయించేది నిర్ణయిస్తారు. ►చివరిగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను గ్రామాల వారీగా ఏ కేటగిరికి ఎన్ని కేటాయించేది ఆర్డీవో అధికారి నిర్ణయిస్తే.. వార్డుల వారీగా ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించేది ఎంపీడీవో నిర్ణయిస్తారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం వెనక్కి
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులకు మానవ వైఫల్యమే తప్ప కుల వ్యవస్థ కారణం కాదు. న్యాయస్థానం ఈ విషయంలో సంపూర్ణ అధికారాలను ఉపయోగించ జాలదు. రాజ్యాంగం మేరకు ఈ మార్గదర్శకాలను అనుమతించలేము. వీటి కారణంగా సంబంధిత కేసుల విచారణ జాప్యం అవుతుంది. అందుకే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసే ముందుగా ప్రాథమిక దర్యాప్తు జరపాలని, అరెస్టుకు సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలంటూ గత ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నాం’అని తెలిపింది.‘ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ విషయంలో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఈ చట్టంలో ప్రాథమిక విచారణ జరపాలనే నిబంధనలు లేవని తెలిపింది.ఆర్టికల్ 15 ద్వారా రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కలి్పంచిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా వారు సామాజికంగా వేధింపులు, వివక్షకు గురవుతున్నారని పేర్కొంది. కులరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అటువంటి పవిత్ర లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాం’అని తెలిపింది. మనుషులతో మలమూత్రాల్ని ఎత్తివేయిస్తున్న పరిస్థితులు, ఈ సందర్భంగా సంభవిస్తున్న మరణాలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రపంచంలో మరెక్కడా కూడా మనుషులను గ్యాస్ చాంబర్లలోకి పంపి చంపడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచి్చన 70 ఏళ్ల తర్వాత కూడా వివక్షకు, అంటరానితనానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం రక్షించలేక పోయిందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌నుద్దేశించి వ్యాఖ్యానించింది. గత ఏడాది మార్చిలో ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సెప్టెంబర్ 18వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టం దురి్వనియోగం అవుతున్నప్పుడు శాసనాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయగలమా? కులం ప్రాతిపదికన ఏ వ్యక్తినయినా అనుమానించగలమా? సాధారణ పౌరుడు కూడా తప్పుడు కేసు పెట్టొచ్చు కదా’అని పేర్కొంది. సమానత్వ సాధనకు సంబంధించిన ఈ అంశంపై నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా ఆ సమయంలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు గత ఏడాది సంచలన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సవరణలు చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులను సమీక్షించాలంటూ సుప్రీంలో పిటిషన్ వేసింది. -
కులాలకు అతీతంగా ఒకే చట్టం ఉండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో చట్టాలు పౌరులందరికీ సమానంగా, కులాలకు అతీతంగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎస్టీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంపై గతంలో ఇచ్చిన తీరును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. ‘దేశంలో జనరల్ కేటగిరీకి ఓ చట్టం, ఎస్సీ,ఎస్టీలకు మరో చట్టం ఉండటానికి వీల్లేదు. అందరికీ ఒకే చట్టం ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమస్యాత్మకంగా మారిందనీ, దీన్ని సమీక్షించాలని కోరారు. దీన్ని వికాస్‌సింగ్ అనే న్యాయవాది వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం, తీర్పును రిజర్వులో ఉంచింది. -
రేణుక చౌదరి భర్త ఎస్సీ, ఎస్టీ కేసు
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్చౌదరితో పాటు మరి కొంత మందిపై బుధవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ప్రెస్ క్లబ్లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు నాగెండ్ల దీపక్ చౌదరి, పులిపాటి వెంకయ్య, నున్నా రవి, సిరిపురపు సుదర్శన్, పొరంపల్లి రామారావు, పుల్లయ్య, శేషు రాం నాయక్, సైదులు నాయక్ మరికొంత మంది గిరిజన మహిళ అని చూడ కుండా కులం పేరుతో దూషింస్తూ, చంపుతామని బెదిరించారని కళావతి తన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆమె పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.