పెళ్లింట్లో భారీ చోరీ
133 తులాల బంగారం
80తులాల వెండి
రూ.2.5లక్షల నగదు అపహరణ
శంకర్‌పల్లి: పట్టణంలోని ఓ పెళ్లి ఇంట్లో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పెళ్లివారంతా హల్దీ వేడుకలో ఉండగా.. దుండగులు తమ పని తాము చేసుకొని వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌ఐ సత్యనారాయణ వెంటనే పెళ్లింటికి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న నార్సింగి ఏసీపీ రమణగౌడ్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శంకర్‌పల్లి సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పార్శి బాలకృష్ణ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. తన కూతురు వివాహం ఈనెల 20న ఉండడంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి బయట హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు వేడుక కోసం బయట ఉన్నారు.
రాత్రి 11గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి.. వేసుకున్న నగలు పెడదామని చూసే సరికి లాకర్ తెరిచి ఉంది. అనుమానం వచ్చి మొత్తం పరిశీలించగా 133 తులాల బంగారం (17 ఆభరణాలు), 80 తులాల వెండి, రూ.రెండున్నర లక్షల నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్‌టీం, రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment