kodangal constituency
-
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను లగచర్ల దాడి కేసు బాధితలు శనివారం కలిశారు. పోలీసుల దాడిపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదన్నారు. రైతుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామమని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. దోషులను కమిషన్ వదిలిపెట్టదని.. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.కాగా, కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. -
మున్ముందు మంచి అవకాశాలు
కొడంగల్: ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, కొడంగల్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. సోమవారం పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో తరలివెళ్లిన రేవంత్, కొడంగల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్‌తో కలసి రిటర్నింగ్ అధికారి లింగ్యానాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది మాత్ర మే కాదని, కొడంగల్‌లోని ప్రతి బిడ్డా తనను తాను పీసీసీ అధ్యక్షుడిగా భావించాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని అన్నారు. సోనియా మనకు మంచి అవకాశాలు ఇస్తున్నారని, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే గొప్ప అవకాశం కొడంగల్ ప్రజలకు వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులోనూ మంచి అవకాశాలు రావచ్చు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదేనని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వచ్చిన మెజార్టీకన్నా ఎక్కువ మెజార్టీ అందించి చూపించాలని కోరారు. రెండేళ్లలో దశ, దిశ మారుస్తాం రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ల మాదిరిగా కొడంగల్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ను రేవంత్ నిలదీశారు. దత్తత కాదు.. ధైర్యం ఉంటే కొడంగల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరినా స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్రం దశ, దిశ మారుతుందని చెప్పారు. హెలీకాప్టర్ ద్వారా కొడంగల్‌కు చేరుకున్న ఆయన ముందుగా గాడిబాయి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కేసుల్లేవు..ఎఫ్‌ఐఆర్‌లున్నాయి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో రేవంత్‌రెడ్డి తన ఆస్తులు అప్పులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. క్రిమినల్ కేసులు లేవని, రాష్ట్రంలోని పలు పీఎస్‌లలో తనపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2022– 23 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ.13,76,700, తన సతీమణి గీతారెడ్డి ఆదాయం రూ.11,13,490 అని తెలిపారు. వ్యవసాయం ద్వారా రూ.3,15,000 ఆదాయం వస్తుందని వివరించారు. సెక్రటేరియేట్ బ్రాంచ్‌లో రూ.3,08,954 డిపాజిట్, ఢిల్లీ పార్లమెంట్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.17,17,461 డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. హోండా సిటీ కారు, మెర్సిడెస్ బెంజ్ కారు, 1,235 గ్రాముల బంగారం, 9,700 గ్రాముల వెండి ఉన్నట్లు వెల్లడించారు. -
కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలి
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన కొడంగల్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తన నివాసానికి చేరుకొని అభిమానులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ భవనాలను తానే మంజూరు చేయించినట్లు చెప్పారు. 2018లో పోలీసులను అడ్డు పెట్టుకొని తనను ఓడించారని, ఇప్పుడు కూడా పోలీసుల సాయంతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌కు కేసీఆర్ అన్యాయం అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గానికి అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ ఊసేలేదని మండిపడ్డారు. కొడంగల్‌ను కేసీఆర్ రెండు ముక్కలు చేసి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగులంతా ఏకమై కేసీఆర్‌ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తామని, కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల మిత్తీకి కూడా సరిపోలేదన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని 8 మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
‘ఓటమి భయంతోనే కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోతున్నారు’
సాక్షి, వికారాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ దత్తత తీసుకుంటే కొండగల్‌కు ఏం జరిగిందని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలను కేసీఆర్ మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మీరు చేతితో కొడితే.. ప్రజలు చెప్పుతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతో కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోతున్నారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారు. నా హయాంలోనే గుడి, బడి, మొత్తం అభివృద్ధి జరిగింది. కొడంగల్‌కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేనే. కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్స్టేషన్లను తీసుకువచ్చాను. బీఆర్ఎస్ హయాంలో నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్‌కి అన్యాయం చేశారు. జిల్లాలు పెంచి కొడంగల్‌ను ముక్కలు చెక్కలు చేశారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్.. ఇంకా ఎందుకు తేలేకపోయారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్‌కు నీళ్లు రావు అని స్పష్టం చేశారు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది అంటూ విమర్శలు చేశారు. మరోవైపు.. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. పొత్తుల విషయం కాంగ్రెస్ త్వరగా తేలిస్తే బెటర్. లెఫ్ట్ పార్టీలకు కేసీఆర్‌పై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఖమ్మంలో పొలిటికల్ ట్విస్ట్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలించేనా? -
కొడంగల్: ఈసారి రేవంత్‌రెడ్డికి కలిసొచ్చే అంశం అదే!
కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు క్రమంగా వేడెక్కుతున్నాయి. అభివృద్దిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జోరందుకున్నాయి. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈసారి ఇక్కడ పోటీ రసవత్తరంగా జరుగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం రెండు జిల్లాలో పరిధిలోకి వెళ్లింది. కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉండగా మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్‌పై పడింది. రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేశారు. అధికార బీఆర్ఎస్తో నిత్యం కొట్లాడి పనుల విషయంలో రాజీలేకుండా పోరాడారు. అందుకే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ చేసి ఓడించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్ది పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించారు. ఓడిపోయినా రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తన సోదురుడు, అవసరమైనప్పుడు ఆయనే వచ్చి నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు ఈసారి ఖాయమనే ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో కూడా ఆయనపై ప్రస్తుతం మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. బీఆర్ఎస్ వర్గపోరు.. రేవంత్‌కు ప్లస్ కానుందా? ఇంకోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు సైతం ఈసారి రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. తనకు రాజకీయంగా మొదటి నుంచి వైరం ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్‌రెడ్డిని కలిసేందుకు నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొడంగల్‌లో కాంగ్రేస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్‌రెడ్డికి 2014లో కాంగ్రేస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే టీఆర్ఎస్లో చేరి చేరి పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. 2018లో టీఆర్ఎస్ ఆయనకు మొండిచెయ్యి చూపింది అయినా పార్టీ అభ్యర్ది విజయం కోసం పనిచేశారు. నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. డీసీసీబీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవటంతో సింగల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తనకు ఎలాగో వయసు మీదపడింది కాబట్టి తన వారసుల రాజకీయ భవితవ్యంపై భరోసా కావాలని అడిగిన ఆయన ఇటీవలే ఢిల్లీలో పార్టీ నేతలను కలిసి వచ్చారు. గుర్నాథ్రెడ్డి పార్టీలో కలవటం కూడ కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది తప్పా తర్వాత ఏం జరగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తాను గతంలో చేసిన అభివృద్ది గెలిపిస్తాయని రేవంత్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం కావటంతో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నియోజకవర్గంపై ఉండనుంది. అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి చాలా మంది ముఖ్యనేతలను పట్టించుకోవటం లేదని, వారంతా ఆయనకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మంజూరైన పనులు కొంతమేర పూర్తి చేయించారు తప్పా కొత్తగా తెచ్చిన పథకాలు ఏమీ లేవు. దారుణంగా బీజేపీ పరిస్థితి.. ఈసారి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్సే? ఇప్పటికీ బొంరాస్ పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడ నిరుపేదలకు అందివ్వలేదు. కోస్గి 50 పడకల ఆస్పత్రి ఇంకా పూర్తి కాలేదు. ఇసుక అక్రమ రవాణ, మైనింగ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. ఇక్కడి రైతులకు సాగునీరందించే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారు. పార్టీలో గ్రూపురాజకీయలు, అంతర్గత కుమ్ములాటలు సైతం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయనే ప్రచారం కొనసాగుతుంది. మొత్తంగా ఈసారి బీఆర్ఎస్కు ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్ధితులే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ పరిస్ధితి అయితే మరి దారుణంగా ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన నాగూరావు నామాజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేవారు కరువయ్యారు. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్ధితి లేదు. దీంతో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గానే సాగనుంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: జిల్లా పునర్విభజనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కొన్ని మండలాలు నారాయణపేట,మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉండటంతో ఎన్నికలపై ప్రభావం చూపిస్తారు. ప్రదానంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి సాగునీటి వసతులు లేవు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాని సాగునీరు అందిస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు తమ ప్రభావం చూపనున్నారు. ఆలయాలు: రెండవ తిరుపతిగా ప్రసిది చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. -
కొడంగల్‌లో వేడెక్కుతున్న రాజకీయం
అధికార పార్టీలో ఇంటిపోరు జిల్లా మొత్తానికి పాకింది. గతంలో తాండూరు, వికారాబాద్‌కే పరిమితమైన గ్రూపు రాజకీయాలు.. నెమ్మదిగా పరిగి, కొడంగల్‌కు విస్తరించాయి. ఈసారి బీఆర్ఎస్ టికెట్ తమకే ఇవ్వాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు. కాదు.. కూడదూ..అంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటామనే సంకేతాలిస్తున్నారు. వికారాబాద్: కొడంగల్‌లో గులాబీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. మెల్లమెల్లగా కారులో చిచ్చు రగులుతోంది. అధికార పార్టీలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు.. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కార్యచరణ ప్రకటనతో బహిర్గతమైంది. దీంతో తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలకే పరిమితమైన ఇంటిపోరు కొడంగల్‌కు సైతం పాకినట్లయింది. త్వరలోనే మండలాల వారీగా తమ అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు గురునాథ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న మీటింగ్ ఏర్పాటుకు నిర్ణయించగా.. కేటీఆర్ నుంచి వచి్చన పిలుపు మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. గత సోమవారమే గురునాథ్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌తో భేటీ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో మీటింగ్ రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల పాటు వేచిచూసి తమ నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. మా పరిస్థితి ఏంటి..? ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గురునాథ్‌రెడ్డి కొడంగల్ గడ్డపై ఓ వెలుగు వెలిగిన నేత. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి 7వేల ఓట్ల తేడాతో, 2014లో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగి 15 వేల ఓట్లతో రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో కొడంగల్ గడ్డపై రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం ఫ్యామిలీ నుంచి నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ వంటి హేమాహేమీలకు ప్రచార, గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో పాతుకుపోయే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా కొనసాగిన గురునాథ్‌రెడ్డి రాజకీయంగా వెనుకబాటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. టికెట్ ఇస్తేనే కొనసాగుతాం.. ఒక్క చాన్స్ అంటూ కొడంగల్‌లో అడుగుపెట్టిన నరేందర్‌రెడ్డి ఏకు మేకై కూర్చున్నారు.అధికార పార్టీ తరఫున ఈసారి కూడా ఆయనే బరిలో ఉంటారనే ఊహాగానాల నేపథ్యంలోబీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకునేందుకు గురునాథ్‌రెడ్డి మద్దతుదారులు రెడీ అవుతున్నారు. అప్పట్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నరేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చామని, ప్రతీసారి ఆయనే పోటీ చేస్తారంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈసారి తన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిని రంగంలో దింపాలని గురునాథ్‌రెడ్డి భావిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తేనే పార్టీలో కొనసాగుతామని, లేదంటే స్వతంత్రఅభ్యరి్థగా పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. 2018లో తాము నిస్వార్థంగా నరేందర్‌రెడ్డికి సపోర్ట్ చేశామని, ఇప్పుడు ఆయన తమకు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ మాటను గౌరవించాం గత ఎన్నికల్లో నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పెద్దలు కేసీఆర్ చెప్పిన మాటను గౌరవించాం. నరేందర్‌రెడ్డి గెలుపుకోసం కృషిచేశాం. కొడంగల్‌లో కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టినం. ఆయన ఈ తూరిగూడ నాకే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మేమెట్ల ఒప్పుకుంటం. స్థానికులకే టికెట్ ఇవ్వాలని లోకల్ క్యాడర్ కోరుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఈసారి మాకే టికెట్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ మేము ఎమ్మెల్యే బరిలో ఉంటాం. – గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ -
వైఎస్ విజయమ్మను కలిసిన గురునాథ్‌రెడ్డి
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి శనివారం వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షు రాలు వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వ కంగా కలిశారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు తమ్మళి బాల్‌రాజ్‌తో కలిసి లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని గురునాథ్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. -
రేవంత్ ఈపీ విచారణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గం నుంచి పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్(ఈపీ)ను హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులైన పట్నం నరేందర్‌రెడ్డి, ఎన్నికల బరిలో నిలిచిన 8 మంది అభ్యర్థులకు, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో భద్రపరిచిన ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. ఈవీఎంల ఉపయోగానికి అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల అతని ఎన్నిక రద్దు చేసి కొడంగల్ నుంచి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.50 లక్షలను పట్నం నరేందర్‌రెడ్డి మనుషుల నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ మొత్తం రూ.5 కోట్ల వరకు ఉంటుందని, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్న విషయాలను నరేందర్‌రెడ్డి బావమరిది తన పుస్తకంలో స్పష్టంగా రాసుకున్నారని, దీనిని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నరేందర్‌రెడ్డి తన అక్రమాలకు ఫామ్‌హౌజ్‌ను వేదికగా చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో రూ.14 కోట్ల వరకు ఖర్చుపెట్టిన నరేందర్‌రెడ్డి, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం కేవలం రూ.26 లక్షలే ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపారన్నారు. నరేందర్‌రెడ్డి అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ఎన్నికల పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అభ్యర్థించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. ఈవీఎంలు వాడుకోండి... ఎన్నికల పిటిషన్ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరిచామని, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కూడా జస్టిస్ షావిలి విచారణ జరిపారు. ఎన్నికల సంఘం తరఫు, రేవంత్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు ఈసీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఓడితే రాజకీయ సన్యాసానికి సిద్ధమే
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను గెలిస్తే రాజకీయాల నుంచి వైదొలిగే దమ్ము మంత్రి కె.తారకరామారావుకు ఉందా.. అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేటీ రామారావు కనుక మాట మీద నిలబడకుంటే ఆయనది కల్వకుంట్ల వంశమేకాదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇక్కడ తన నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘నేను ఓడిపోతానని కేటీఆర్ చెప్పారు. నిజంగా ఆయన అన్నట్లు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి నేను గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసంతోపాటు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తారా. గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వందసీట్లు రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 99 సీట్లు వచ్చాయి. అయినా, కేటీఆర్ మాట మీద నిలబడలేదు. కనీసం ఇప్పుడైనా మాట మీద ఉంటారా?’అని రేవంత్ ప్రశ్నించారు. రెండుచోట్ల ఓటు నమోదుపై చర్య తీసుకోవాలి సీఎం కేసీఆర్ రెండుచోట్ల ఓటు నమోదు చేసుకున్నారని, ఇది చట్టరీత్యా నేరమని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో కేసీఆర్ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అదే పేరును అటు ఇటు మార్చి గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల, తండ్రి రాఘవరావు అని ఓటర్ల జాబితాలో నమోదై ఉంది. ఇలా ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 ప్రకారం నేరం. ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటుహక్కు కలిగి ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి. లేనిపక్షంలో చట్టప్రకారం ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంటుంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. చట్టప్రకారం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ పేరుతో రెండుచోట్ల ఓటర్ల జాబితాలో చోటు కల్పించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా’అని రేవంత్ చెప్పారు. కక్షపూరితంగానే ఓట్ల తొలగింపు ఓటుహక్కు ఇవ్వకపోవడం ద్వారా 20 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు. ఈ విషయంపై క్షమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కోరగా, కేటీఆర్ మాత్రం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారని ఎన్నికల అధికారులకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు చెప్పిన ఈసీ, ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించలేదన్నారు. కక్షపూరిత విధానంతో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ల వివరాలను బూత్‌లవారీగా గుర్తించి 50 నుంచి 200 ఓట్లు తొలగించారని రేవంత్ ఆరోపించారు. ఓటు హక్కు కల్పించడంలో విఫలమైన అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. -
హైడ్రామా మధ్య రేవంత్ అరెస్ట్, విడుదల
కొడంగల్/జడ్చర్ల: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని సోమవారం హైడ్రామా మధ్య పోలీ సులు అరెస్టు చేశారు. కొడంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు మంగళవారం కోస్గిలో సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటానంటూ ఆయన ప్రకటించడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో పోలీసులు రేవంత్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గేటు తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు, బెడ్రూంలో నిద్రిస్తున్న రేవంత్‌ను బయటకు రావాల్సిందిగా పిలిచారు. ఆయన బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో తలుపును బలవంతంగా నెట్టివేశారు. దీంతో బెడ్రూం గొళ్లెం విరిగిపోయింది. అనంతరం రేవంత్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుకు సహకరించలేదు. వారెంట్ చూపకుండా అరెస్టు్ట చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నిస్తూ పోలీసులను బయటకు వెళ్లాలని గదమాయించారు. ఈసీ ఆదేశాలను అమలు చేయాలంటూ రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు. తన భర్తను అరెస్టు చేయడంపై రేవంత్ సతీమణి గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము ఏమైనా టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు తన భర్తను లాక్కెళ్లడం దారుణమన్నారు. కేసీఆర్ తమ కుటుంబంపై కక్షగట్టారని ఆరోపించారు. కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లోని కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ముగిశాక 6 గంటల ప్రాంతంలో రేవంత్‌ను తిరిగి ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. కాగా, రేవంత్ అరెస్టు నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అక్రమ అరెస్టులతో సీఎం సభ: రేవంత్ అక్రమ అరెస్టులు నిర్వహిస్తూ పోలీసుల పహారాలో కేసీఆర్ కోస్గిలో సభ నిర్వహించుకున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం పోలీసులు రేవంత్‌ను విడిచిపెట్టిన అనంతరం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్గి సభలో తన పేరు ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్.. ఇంక తననేం ఓడిస్తారని ప్రశ్నించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌లను కేసీఆర్ తొత్తులుగా మార్చుకొని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటుకు రూ. 5 వేల చొప్పున కొడంగల్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లతో కేసీఆర్ ప్రజలపై యుద్ధం ప్రకటించారన్నారు. ‘‘ఎన్నికలకు ఇంకా 48 గంటల సమయం ఉంది. ముగ్గురూ రండి కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం’’ అని సవాల్ విసిరారు. -
ఆగమాగం కావద్దు.. గాలిగాళ్లు గెలుస్తారు : కేసీఆర్
సాక్షి, కోస్గి (కొడంగల్) : ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓట్లు వేయాలని, లేకుంటే గాలిగాళ్లు గెలుస్తారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు, ప్రజల ఎజెండా గెలవాలని, అప్పుడే మేలు జరుగుతుందన్నారు. పాలమూరు జిల్లాలో 14 సీట్లలో టీఆర్ఎస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ‘ 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంట్ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? తమషా చేస్తే కరెంట్ రాలేదు.. కష్టపడితేనే 24 గంటల కరెంట్ వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చాం. గుంట జాగున్న రైతులకు కూడా రైతు బీమా వర్తింప జేస్తున్నాం. ఎలాంటి పైరవీలు లేకుండానే డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. కల్యాణీ లక్ష్మీతో పేదింటి ఆడపిల్లలకు అండగా ఉన్నాం. మహిళలు ప్రసవిస్తే.. ఒకప్పుడు చాలా దోపిడికి గురయ్యేవారు. ఇప్పుడు ఉల్టా డబ్బులు ఇస్తూ అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దింపుతున్నారు. మేం పెట్టిన సంక్షేమ పథకాలు మీ కళ్లముందే ఉన్నాయి. పాలమూరు శత్రువులు.. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను అడ్డుకుంది చంద్రబాబే. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ చంద్రబాబు చేతుల్లో పెడతారా? పాలమురు జిల్లాలోనే పాలమూరుకు శత్రువులు ఉన్నారు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి, మరో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి కేసులు వేశారు. నిన్ననే హైకోర్టు చెంప చెల్లుమనిపించింది. పాలమూరు దరిద్రం వదలాలంటే ఈ దరిద్రులను ఓడించాలి. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే కొడంగల్, నారయణపేట సస్యశ్యామలం అవుతుంది. కులం, మతం, జాతి వివక్ష లేకుండా పాలించాం. పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఎన్నికల అనంతరం కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడనే కూర్చుని.. మీ సమస్యలను పరిష్కరిస్తా. నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల నిర్మాణాలకు ప్రభుత్వం ఏర్పాటైన వారంలో రోజుల్లోనే జీవో విడుదల చేస్తాం. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం.’ అని హామీలు ఇచ్చారు. -
ఆ సీల్డ్ కవర్లో ముఖ్య వివరాలే ఉండొచ్చు
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించి ఐటీ నుంచి ఒక సీల్డ్ కవర్ నివేదిక అందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ వెల్లడించారు. అయితే అందులో ఏముందో తానింకా చూడలేదని, దీనిపై వివరాలు మీడియాకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘సీల్డ్ కవర్ వచ్చింది కాబట్టి అందులో ఏదో ముఖ్యమైన వివరాలే ఉండొచ్చు. లేకుంటే సీల్డ్ కవర్ ఎందుకొస్తుంది..’అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మొత్తం సీజ్ విలువ రూ.104.41 కోట్లు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొందరు వ్యక్తులు ముందుగానే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటున్నారని వాటిని గుర్తించి ధ్వంసం చేయాలని సీఈఓ ఆదేశించారు. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు మద్యం పంపిణీ యోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని, దీనిపై ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పటివరకు నగదు, మద్యం, గంజాయి సహా మొత్తం సీజ్ విలువ రూ.104.41 కోట్లకు చేరిందన్నారు. అందులో నగదు రూ.87.98 కోట్లు ఉందన్నారు. మద్యం విలువ రూ.8.86 కోట్లుగా పేర్కొన్నారు. సీజ్ చేసిన నగదులో రాజకీయ పార్టీలవి కొంత మొత్తమే ఉన్నట్లు నిర్ధారించామని, అందులో అధికార పార్టీ నుంచే అధికంగా ఉందన్నారు. పట్టుబడిన వాటిలో కొందరు ఆధారాలు చూపించి, నగదును వెనక్కి తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే కొంత సొమ్ము మూలాలు తెలియడం లేదన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో కొన్ని చోట్ల నక్సలైట్లు, ఇతరత్రా సమస్యలున్నందున ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. అధికారులు, పార్టీలకు ఆ జాబితాలు నకిలీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించకుండా అబ్సెన్టి, షిప్టెడ్, డూప్లికెట్ కింద ఒక జాబితాను తయారు చేసి పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు అందివ్వనున్నట్లు సీఈఓ చెప్పారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరెవరు పోటీలో ఉన్నారనే అభ్యర్థుల జాబితాను సీఈవో వెబ్సైట్లో పెడతామని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఈసీ నిబంధనలకు అనుగుణంగా పాస్‌ఫొటోలు సమర్పించనందునే కొంత ఆలస్యమైందని చెప్పారు. పెరిగిన అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బ్యాలట్ యూనిట్లు (బీయూ) 4,570 బెంగళూరు నుంచి వస్తున్నాయన్నారు. అభ్యర్థుల వారీగా బీయూలో మీటలను సెట్ చేస్తామన్నారు. ఈవీఎం బ్యాలెట్ ముద్రణ కూడా పూర్తవుతుందన్నారు. వచ్చే ఒకటో తేదీ వరకు ఈ ప్రకియను ముగిస్తామన్నారు. మంత్రి హరీశ్‌పై చర్యలు తీసుకుంటాం ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఈసీ ఆదేశాలకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావుపై ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 125 ప్రకారం చర్యలు తీసుకుంటామని రజత్‌కుమార్ చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే పార్టీకి హోర్డింగ్స్‌కి అవకాశం కల్పిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని, అయితే అందరికీ అవకాశమివ్వాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది మీడియాకు స్వేచ్ఛ ఉందని, కొన్ని విషయాల్లో నియంత్రించడం సరికాదని రజత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని, అయితే సర్వే చేసుకుని ఎవరికెన్ని సీట్లు అనేది మాత్రం పబ్లిష్ చేసుకోవచ్చునని తెలిపారు. దీనిపై మీడియాకు స్వేచ్ఛ ఉందన్నారు. దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లపై ఈసీ నుంచి వచ్చిన యాక్సెసబుల్ అబ్జర్వర్స్ సంతృప్తి వ్యక్తం చేశారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని కితాబిచ్చారన్నారు. గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి మిస్సింగ్‌పై పోలీసుల నుంచి నివేదిక కోరామని తెలిపారు. ఓటర్లు స్లిప్పుల వెనుక గూగుల్ మ్యాప్ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలైందని, వాటి వెనక భాగంలో పోలింగ్ కేంద్రానికి దారిచూపే గూగుల్ మ్యాప్ కూడా ఉంటుందని సీఈఓ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వచ్చే నెల 2 వరకు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే అంతకంటే ముందే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొత్తం నమోదైన 2.80 కోట్ల ఓటర్లలో 19 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో దాదాపు 7.5 లక్షల మంది ఓటర్లు 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారేనన్నారు. బూత్ లెవెల్ స్థాయి అధికారులపై అనేక ఫిర్యాదులు అందినప్పటికీ, ఓటరు నమోదు ప్రక్రియ సంతృప్తికరంగానే ముగిసిందని చెప్పారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా డబ్బు?
సాక్షి, వికారాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. కోస్గి మండలం మీర్జాపూర్‌లోని ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున ఈ సోదాలు దాదాపు 45 నిమిషాలపాటు జరిగినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాల్లో నరేందర్ రెడ్డి నివాసంలో పెద్దమొత్తంలో నగదు దొరికినట్లు సమాచారం. పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ స్పందించారు. ఆయన నివాసంలో ఐటీ సోదాలు నిజమేనని, ఈ మేరకు సీల్డ్ కవర్ నివేదిక తమకు అందిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు కోసం రేవంత్‌రెడ్డి, నరేందర్ రెడ్డి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
రేవంత్ దూకుడు : ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా
-
రేవంత్ దూకుడు : ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను గట్టిగా విమర్శించిన రేవంత్.. తాను పదవిలో ఉండి వేరొక పార్టీలోకి మారితే, అలాంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని భావనలోనే స్పీకర్ ఫార్మాట్లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి విరుద్ధంగా రేవంత్ శనివారం సాయంత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించడం గమనార్హం. రేవంత్ రాజీనామాపై స్పీకర్ మధుసూదనాచారి స్పందించాల్సిఉంది. రాహుల్ సభలో కాంగ్రెస్‌లోకి! : రెండు వారాల కిందట ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారన్న వార్త తెలిసిందే. రాహుల్.. నవంబర్ రెండో వారంలో తెలంగాణకు రానున్నారు. ఆయన పాల్గొనే సభను ఎక్కడ నిర్వహించాలనేదానిపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదే సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారమేదీ లేదు. -
దొంగల్లా కొండంగల్ ను విభజించారు: రేవంత్
-కొడంగల్‌ను పాలమూరు జిల్లాలో ఉంచాలి -పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి -దుద్యాల, గుండుమాల్ను మండలాలు చేయాలి -రిలే దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరు జిల్లాలో ఉంచాలని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అఖిల పక్షం, కొడంగల్ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో 12 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహర దీక్షలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. బొంరాస్‌పేట మండలం దుద్యాల, కోస్గి మండలం గుండుమాల్ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్న ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కనీసం వార్డు మెంబర్‌కు కూడా గెలవలేని నిరంజన్‌రెడ్డి మాటలు వింటున్న ముఖ్యమంత్రి తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని ఆరోపించారు. తనపై రాజకీయంగా గెలవలేక కుట్రలు, కుతంత్రాలు చేసి నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేశారన్నారు. జిల్లా మంత్రులకు, ఎంపీ జితేందర్‌రెడ్డికి, మంత్రి వర్గ ఉప సంఘానికి తాను వ్యక్తిగతంగా కలిసి కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరులోనే ఉంచాలని సూచించినట్లు చెప్పారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే లేఖ ఇవ్వడం వల్ల రాత్రికి రాత్రి దొంగల్లా కొడంగల్‌ను విభజించి మూడు మండలాలను వికారాబాద్‌లో, రెండు మండలాలను పాలమూరులో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్‌కు అన్యాయం జరగడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందన్నారు. డ్రాప్ట్ నోటీఫికేషన్ వరకు కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరు జిల్లాలో ఉంచిన తర్వాత విభజించడం వెనుక కుట్ర దాగుందన్నారు. తనపై రాజకీయ కక్ష సాధించాలంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రజలు ఏ పాపం చేశారని ప్రశ్నించారు. కొడంగల్ నుంచి 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన గురునాథ్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. ఐదుసార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం గురునాథ్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వారం రోజుల్లోపు ముఖ్యమంత్రి అపాయిమెంట్ తీసుకోవాలని గురునాథ్‌రెడ్డికి సూచించారు. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడి ప్రజల ఆవేదన వినిపించడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో తాను ఎక్కడికైనా రావడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేయడానికి ఇప్పటికే బొంరాస్‌పేట, దౌల్తాబాద్ నాయకులు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. -
పాలమూరులో ‘దేశం’ కనుమరుగు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ రాజకీయ ముఖ చిత్రం నుంచి టీడీపీ క్రమంగా కనుమరుగవుతోంది. ముఖ్యనేతలు, క్రియాశీల కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. పోటీలో ఉన్నా చాలా చోట్ల ఉనికి కోసమే నామినేషన్లు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎల్కొటి ఎల్లారెడ్డి (నారాయణపేట), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి) పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా ద్వితీయశ్రేణి నాయకత్వం మూకుమ్మడిగా ఇతర పార్టీల్లో చేరింది. షాద్‌నగర్, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, ఆలంపూర్, మహబూబ్‌నగర్‌లో కనీసస్థాయి నాయకత్వం కూడా లేకుండా పోయింది. కల్వకుర్తి నగర పంచాయతీలో కేవలం ఒక వార్డులో మాత్రమే పార్టీ అభ్యర్థి బరిలో ఉండడం తెలుగుదేశం పరిస్థితికి అద్దం పడుతోంది. బీజేపీతో ఎన్నికల అవగాహన ఉంటుందనే వార్తలతో.. ఇక ఈ పార్టీలో ఉన్నా భవిష్యత్ లేదనే భావన పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది. * షాద్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఉన్నా నాయకులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. 2009లో ఎన్నికల అవగాహనలో భాగంగా టీఆర్ఎస్కు కేటాయించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కుదిరితే టీడీపీ పోటీలో ఉండే అవకాశం లేదు. ఒక వేళ టీడీపీ పోటీ చేస్తే తమకే టికెట్ ఇవ్వాలని బీసీ నేతలు పట్టుపడుతున్నారు. * నారాయణపేటలో ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి ఇటీవలే పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని రాజేందర్‌రెడ్డి ఇన్చార్జిగా ఉన్నా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. * మక్తల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి ఉన్నా ఆయన రాజకీయ భవిష్యత్‌పై కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి టీఆర్ఎస్ నుంచి మక్తల్‌లో పోటీ చేస్తారనే వార్తలతో టీడీపీ నుంచి ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. * జడ్చర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీ కేడర్‌ను పట్టించుకోవడం లేదు. దీంతో మూకుమ్మడిగా టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో మెజారిటీ శాతం టీడీపీ నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. * ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఒకవేళ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే యోచనలో వున్నారు. * కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీని వీడటంతో పార్టీ తరపున అటు మున్సిపల్, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యారు. కల్వకుర్తి నగర పంచాయతీలో 20 వార్డులకు గాను ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు నామమాత్రంగా పోటీ ఇచ్చే అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేశారు. * నాగర్‌కర్నూల్‌లో సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, ఉపఎన్నికలో పోటీ చేసిన మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీని వీడటంతో చెప్పుకోదగిన నాయకత్వం లేదు. * అచ్చంపేటలో ఎమ్మెల్యే రాములు పార్టీని వీడుతున్నారనే ప్రచారం పార్టీ శ్రేణులపై ప్రభావం చూపుతోంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రాములు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. * కొల్లాపూర్‌లో డాక్టర్ శ్రీనివాస్ పార్టీ బాధ్యతలు చూస్తున్నా కింది స్థాయిలో పటిష్టంగా లేకపోవడంతో సాధారణ ఎన్నికల్లో నామమాత్ర పోటీకి పరిమితమయ్యే అవకాశం వుంది. * వనపర్తిలో ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి తెలంగాణ మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు అప్పగించారు. ఈసారి తాను ఎన్నికల బరి నుంచి తపుకుని ద్వితీయ శ్రేణి నాయకుడిని ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. * అలంపూర్‌లో పార్టీ ఇంచార్జి ఆంజనేయులు ఉన్నా ఆర్ధికంగా లేకపోవడంతో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నామమాత్ర పోటీకే పరిమితమవుతోంది. * దేవరకద్రలో ఎమ్మెల్యే సీతమ్మ పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది. * గద్వాలలో మాజీ మంత్రి డీకే సమర సింహారెడ్డి తన రాజకీ య అనుభవంతో పార్టీని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. * మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజేశ్వర్‌గౌడ్ టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల్లో అభ్యర్థులను నిలిపేందుకు పార్టీ నేతలు తంటాలు పడి అక్కడక్కడా అభ్యర్థులను బరిలోకి దింపారు.