సాక్షి, వికారాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ దత్తత తీసుకుంటే కొండగల్‌కు ఏం జరిగిందని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలను కేసీఆర్ మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మీరు చేతితో కొడితే.. ప్రజలు చెప్పుతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతో కేసీఆర్ గజ్వేల్ నుంచి పారిపోతున్నారు. ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారు. నా హయాంలోనే గుడి, బడి, మొత్తం అభివృద్ధి జరిగింది. కొడంగల్‌కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేనే. కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్‌స్టేషన్లను తీసుకువచ్చాను.
బీఆర్‌ఎస్ హయాంలో నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్‌కి అన్యాయం చేశారు. జిల్లాలు పెంచి కొడంగల్‌ను ముక్కలు చెక్కలు చేశారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్.. ఇంకా ఎందుకు తేలేకపోయారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్‌కు నీళ్లు రావు అని స్పష్టం చేశారు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది అంటూ విమర్శలు చేశారు.
మరోవైపు.. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. పొత్తుల విషయం కాంగ్రెస్ త్వరగా తేలిస్తే బెటర్. లెఫ్ట్ పార్టీలకు కేసీఆర్‌పై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో పొలిటికల్ ట్విస్ట్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలించేనా?
Comments
Please login to add a commentAdd a comment