కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను గట్టిగా విమర్శించిన రేవంత్.. తాను పదవిలో ఉండి వేరొక పార్టీలోకి మారితే, అలాంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని భావనలోనే స్పీకర్ ఫార్మాట్‌లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి విరుద్ధంగా రేవంత్ శనివారం సాయంత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించడం గమనార్హం. రేవంత్ రాజీనామాపై స్పీకర్ మధుసూదనాచారి స్పందించాల్సిఉంది.
రేవంత్ దూకుడు : ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా
Published Sat, Oct 28 2017 4:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement