కాళేశ్వరం కమిషన్‌ను కలిసిన రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం | Retired Engineers Meet Kaleshwaram Commission Officers | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం కమిషన్‌ను కలిసిన రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం

Published Sat, Jun 15 2024 3:23 PM

Retired Engineers Meet Kaleshwaram Commission Officers

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్‌ అధికారులన రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం శనివారం కలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్‌కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పడింది.

సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సేకరించి పనిలోపడ్డ కాళేశ్వరం కమిషన్.. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యచరణను ప్రారంభించనుంది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవడానికి కమిషన్‌ కసరత్తు చేస్తోంది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే కమిషన్‌ మరోసారి అందరిని క్రాస్ ఎగ్జామినింగ్‌ చేయనుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement