హైదరాబాధ్: నిర్మాణరంగ దిగ్గజంఅపర్ణ గ్రూప్‌లో భాగమైన అపర్ణఎంటర్‌ప్రైజెస్ తాజాగా ప్రీమియం టైల్స్ తయారీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తూ. గోదావరి జిల్లా కాకినాడ దగ్గర్లోని పెద్దాపురం వద్ద రూ.320 కోట్లతో టైల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అత్యాధునికంగా నెల కొల్పిన ఈ ప్లాంట్‌లో డబుల్ చార్జ్ విట్రిఫైడ్ ఫ్లోర్ టైల్స్ ఉత్పత్తి చేయనున్నట్లు గ్రూప్ మంగళవారం వెల్లడించింది. ప్రత్యేక బ్రాండ్ కింద వీటిని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా అపర్ణ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ కంపెనీ తదుపరి దశ అభివృద్ధి కోసం, అలాగే వెనుకబడిన ప్రాజెక్టుల అనుసంధానంపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. ఈ టైల్ యూనిట్లో రోజుకు 1.75 లక్షల ఒక చదరపు అడుగు పలకలను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో రూ 200 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇది రెట్టింపు అవుతుందని, సుమారు రూ. 600 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామని రెడ్డి చెప్పారు.
మరోవైపు రిటైల్, ఎంటర్టైన్మెంట్ మరియు వాణిజ్య స్థలంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నామని చెప్పారు. కొత్తగా అపర్ణ సరోవర్ జెనిత్ పేరుతో మరో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును నల్లగండ్లలో ప్రారంభిస్తున్నట్లు రెడ్డి తెలిపారు. సుమారు పాతిక ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాజెక్టులో 2,475 యూనిట్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. సరసమైన హౌసింగ్ ప్రాజెక్ట్ లో రూ. 20 లక్షల నుంచి రూ. 45 లక్షల రేంజ్‌లో 800 నుంచి 1,500 చదరపు అడుగుల లో అపార్టుమెంట్లను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ఐటీ హబ్‌కు దగ్గర్లోని అపర్ణ సరోవర్ జెనిత్ వీటిల్లో ఒకటి అని చెప్పారు.
కాగా రెండు దశాబ్దాల హైదరాబాద్ ఆధారిత రియల్ ఎస్టేట్ కంపెనీ సీపీవీస్ విండోస్, సానిటరీవేర్, 12 రెడీ మిక్స్ కాంక్రీట్ యూనిట్లు, ఇటుక తయారీ, తలుపులు మరియు కిటికీల తయారీ సహా పలు వెనుకబడిన అనుసంధానం ప్రాజెక్టులను చేపట్టింది. గ్రీన్ ఫీల్డ్ తయారీ యూనిట్‌లో విభిన్నంగా వీటిని తయారు చేయనుంది. దీంతోపాటు గుజరాత్లో తన ఉత్పత్తుల శాఖను విస్తరించేందుకు టైల్ యూనిట్ కొనుగోలు చేయడానికి లేదా వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తోంది. టైల్స్ పంపిణీ సంస్థగా 1990లో కార్యకలాపాలు ప్రారంభించిన తమ సంస్థ ప్రస్తుత టర్నోవరు రూ. 1,300 కోట్ల స్థాయిలో ఉందని ఎస్‌ఎస్ రెడ్డి చెప్పారు.
పెద్దాపురంలో అతిపెద్ద టైల్స్ ఫ్యాక్టరీ
Published Wed, May 24 2017 9:02 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
Advertisement