Case Filed After Priyanka Gandhi 50 Percent Commission Comment - Sakshi
Sakshi News home page

50 శాతం కమిషన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై కేసు..

Published Sun, Aug 13 2023 11:32 AM | Last Updated on Sun, Aug 13 2023 12:20 PM

Case Filed After Priyanka Gandhi 50 Percent Commission Comment  - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ఎంపీ కమల్‌ నాథ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్‌లపై కేసు నమోదైంది. అవినీతి అరోపణలపై నకిలీ లేఖను సోషల్ మీడియాలో జ్ఞానేంద్ర అవస్తీ పేరిట ప్రచారం చేస్తున్నారని బీజేపీ లీగల్ సెల్ కన్వినర్‌ నిమేశ్ పతాక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 50 శాతం కమిషన్‌ను ప్రభుత్వం రాబడుతుందని ట్వీట్టర్(ఎక్స్‌) వేదికగా వాద్రా ఆరోపణలు చేశారు. కమీషన్ ఇవ్వనిదే బిల్లులు ముందుకు వెళ్లడం లేదని కాంట్రాక్టర్లు హైకోర్టు సీజేకి లేఖ రాశారంటూ పోస్టు చేశారు. కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లోనూ ఇలాగే కమిషన్ లేనిదే పనిజగట్లేదని ఆరోపణలు చేశారు. ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్‌లు, అరుణ్‌ యాదవ్‌లు పోస్టు చేశారు. 

వీరిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, కమల్ నాథ్, అరుణ్‌ యాదవ్‌లపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బతీయాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

ప్రియాంక గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నా చూపించాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో ఎంతో కాలం లబ్ది పొందలేని చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. వారి మాటల్లో నిజం లేదని చెప్పారు. ప్రియాంక గాంధీ పోస్టుకు సంబంధించిన వ్యక్తులపై గ్వాలియర్‌లోనూ కేసులు నమోదయ్యాయని అన్నారు. 

ఇదీ చదవండి: ఎన్డీయేలోకి శరద్‌ పవార్‌..? తాజా భేటీ ఎందుకు..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement