సుందిళ్ల్గ బ్యారేజీ నిర్మాణ పనులను తల్లిదండ్రులతో కలసి చూస్తున్న నేహాల్
మంథని/రామగుండం: నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్ చిన్నారి నేహాల్ శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి, కాళే శ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని డివిజన్‌లో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్‌లను సందర్శించారు. తన తల్లిదండ్రులు రజని–హనుమంతరావు, ఇంజనీరింగ్ అధికారులకు కలసి వచ్చిన నేహాల్ తొలుత గోలివాడలో పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ‘‘ఎల్లం ప్రాజెక్టు ఇదే నా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించారు కదా.? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయికి ఆధారం.
దీని కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది కదా’అంటూ టక..టక వివరాలు చెప్పారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్ చూశాడు. మధ్యమానేరు నీటినిల్వ సామర్థ్యం ఎంతా? అని అని తల్లి రజని ప్రశ్నించగా 32 టీఎంసీలు అని వివరించాడు. సుందిళ్ల బ్యారేజీ కాంట్రాక్ట్ పనులు ఎవరు దక్కించుకున్నారని అడగ్గా నవయుగ కంపెనీ అని చెప్పాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నదానికంటే ఇక్కడి వచ్చిచూస్తే షాక్ గురయ్యానని.. తాతయ్య కేసీఆర్ డిజైన్ చేసినట్లు కోటి ఎకరాల కు సాగునీరు అందడం ఖాయమన్నారు. చిన్నారి వెంట లైజనింగ్ ఆఫీసర్ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు బండ విష్ణుప్రసాద్, నరేశ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment