కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ | Two Pumps starts At Kannepalli Pump House | Sakshi
Sakshi News home page

కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ

Published Mon, Jul 22 2019 6:48 AM | Last Updated on Mon, Jul 22 2019 6:48 AM

Two Pumps starts At Kannepalli Pump House - Sakshi

ఆదివారం కన్నెపల్లి పంపుహౌస్‌లో రెండు మోటార్లు నడుస్తున్న దృశ్యం 

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కన్నెపల్లి పంపుహౌస్‌లో మళ్లీ 2 మోటార్లను  అధికారులు ప్రారంభించారు. 4 రోజులుగా ఆటోమోడ్‌ పద్ధతిలోకి మార్చడానికి మోటార్లకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం 3, 4 నంబర్ల మోటార్లు డెలివరీ సిస్టంలో నీటిని ఎత్తిపోశాయి.  కన్నెపల్లిలో 2, 7, 8 మోటార్లకు కూడా వెట్‌రన్‌ నిర్వహిస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్ల ను మూసివేశారు. 4 రోజుల క్రితం వరద ఉధృతి పెరగడంతో ఇంజనీరింగ్‌ అధికారులు 8 గేట్లు ఎత్తారు. వరద ఉధృతి తగ్గుతుండడంతో రెండేసి చొప్పున గేట్లు మూస్తూ వచ్చారు.  బ్యారేజీ వద్ద 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 7 టీఎంసీలు నిల్వ ఉంది. అన్నారం బ్యారేజీలో 4 రోజులుగా మోటార్లు నిలిపివేశారు. ఆదివారం కన్నెపల్లిలో 2 మోటార్లు నడపడంతో మళ్లీ గ్రావిటీ కాల్వ నుంచి నీటిని తరలించారు. దీంతో అన్నారం బ్యారేజీలోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 5.8 టీఎంసీల నీరునిల్వ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement