సాక్షి, హైదరాబాద్: కన్నెపల్లిలోని మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి, డెరైక్టర్ బి.శ్రీనివాసరెడ్డి అన్నీ తామై వ్యవహరించారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకు కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్ బే, నీటి నిల్వ, నీటిని పంప్ చేసే విధానం, దాని నిర్మాణం తదితర విశిష్టతల గురించి వివరించారు. మోటార్ల పనితీరుపై వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పంప్ హౌస్‌లో మోటార్స్ ఏర్పాటు చేసిన దిగువ ప్రాంతానికి గవర్నర్, ఇద్దరు సీఎంలను తీసుకెళ్లి మోటార్ల పనితీరు, వాటి సామర్థ్యం తదితర అంశాలను వివరించారు. ఆపై పంప్‌హౌస్ ఎగువ భాగానికి వచ్చి.. మోటర్లను కంప్యూటర్ ద్వారా సీఎం ఆన్ చేశారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ పాయింట్ వద్దకు వెళ్లి నీరు ఉబికివస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంప్‌హౌస్‌ను వేగంగా నిర్మించడంపై మేఘా ఇంజనీర్లను సీఎం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment