పీసీసీ రానందుకు బాధగా ఉంది: ఎంపీ కోమటిరెడ్డి | YSR Birth Anniversary Komati Reddy Pays Tribute To YSR | Sakshi
Sakshi News home page

పీసీసీ రానందుకు బాధగా ఉంది: ఎంపీ కోమటిరెడ్డి

Jul 8 2021 1:39 PM | Updated on Jul 8 2021 2:05 PM

YSR Birth Anniversary Komati Reddy Pays Tribute To YSR - Sakshi

సాక్షి, యాదాద్రి : తనకు పీసీసీ అధ్యక్ష పదవి రానందుకు బాధగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో జరిగిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా పోలేదు. నాకు పార్టీ మారే అవసరం లేదు. నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం లేదు. నాకు ఏ పదవి అవసరం లేదు. గాంధీ భవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement