Dr. YS Rajasekhara Reddy Jayanthi Celebrations In Australia - Sakshi
Sakshi News home page

YSR Jayanti Celebrations: ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Published Sat, Jul 8 2023 8:12 AM | Last Updated on Sat, Jul 8 2023 9:39 AM

YSR Jayanti Celebrations In Australia - Sakshi

దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డిగారి 74వ జయంతిని పురష్కరించుకుని ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో వైఎస్‌ర్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన నగరాల్లో కేకులు కట్ చేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని  ఎన్ఆర్‌ఐ కార్యవర్గ సభ్యులు ఆయా నగరాల్లో పాల్గొన్నారు.

వైసీపీ పార్టీ నాయకులూ వెంకట్ మేడపాటి, చల్లా మధు, శిల్పా రవి, మల్లాది విష్ణు, మోదుగుల వేణుగోపాల రెడ్డి, అబ్బయ్య చౌదరి, గంగుల బ్రిజేంద్రలు ఈ సందర్భంగా జూమ్ కాల్ ద్వారా మాట్లాడి వైస్సార్ గారు చేసిన పనులను మరొక్కసారి గుర్తు చేసుకుని, జగన్ గారు తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని, అభివృద్ధిలో ఎన్ఆర్‌ఐలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు రాజశేఖర్ లంకెల, శ్రీధర్ గూడ,ఇన్నారెడ్డి, విజయ్ కర్నాటి , బిజివేముల రఘు రెడ్డి, యుగంధర్ అల్లం, వంశి చాగంటి,నర్రెడ్డి ఉమా శంకర్, మర్రి కృష్ణ రెడ్డి, కందుల భరత్, గాయం శ్రీనివాస్ రెడ్డి, లెక్కల బ్రహ్మానంద రెడ్డి, బొమ్మిరెడ్డి జస్వంత్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

(చదవండి: వైఎస్సార్‌ జయంతికి అమెరికాలో భారీ ఏర్పాట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement