వైఎస్సార్‌ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు | YSR Birth Anniversary Vijaya Sai Reddy Praises YSR | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు

Published Thu, Jul 8 2021 2:11 PM | Last Updated on Thu, Jul 8 2021 2:17 PM

YSR Birth Anniversary Vijaya Sai Reddy Praises YSR - Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌ ఆశయాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం బాల సహయోగ్‌లో జరిగిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వైఎస్సార్‌ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్‌ పాలన చేశారు.
వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

కాగా, ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement