వేంపల్లెలో కుటుంబ సభ్యులతో వైఎస్సార్‌టీపీ గౌరవాధ్యక్షురాలు షర్మిల
వైఎస్సార్: ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, కుటుంబ సభ్యులు అంజలి, రాజారెడ్డిలు శుక్రవారం ఇడుపులపాయ చేరుకున్నారు. షర్మిల సాయంత్రం 4.30గంటలకు కడప ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.
అంతకుమునుపే వైఎస్ విజయమ్మ వచ్చారు. నేడు (శనివారం) వైఎస్సార్ జయంతి సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 7.30గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్‌ఎల్వీ ప్రసాద్‌రెడ్డి, బంకా సోమేశ్వరరెడ్డి, రామగంగిరెడ్డి, శ్రీనివాసులు, ఎస్టేట్ మేనేజర్ భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment