
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment