
నేడు వై.ఎస్.ఆర్ జయంతి. 1949 జూలై 8న ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా 2004–2009 లో పని చేశారు. 2003లో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మూడు నెలల పాటు నిరంతరాయంగా చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మకమైనది. మండే ఎండల్లో ఆయన 1,475 కి.మీ. నడిచి ఊరూరా తిరిగారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక హామీలను నెరవేర్చారు. ప్రజా సంక్షేమ, ప్రజారోగ్య పథకాలను ప్రవేశపెట్టి, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రానికి కూడా ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment