Congress President Mallikarjun Kharge Tweet On YSR On His Birth Anniversary - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జయంతి.. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ట్వీట్‌

Published Sat, Jul 8 2023 10:39 AM | Last Updated on Sat, Jul 8 2023 11:34 AM

Congress President Mallikarjun Kharge Tweet On Ysr Jayanti - Sakshi

సాక్షి, ఢిల్లీ: మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ‘‘వైఎస్సార్‌ తన చివరి శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేశారు. ప్రజలంటే ఎనలేని ప్రేమ కలిగిన నాయకుడు వైఎస్సార్‌. ప్రజలు, కాంగ్రెస్‌కు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిది’’ అంటూ ఖర్గే ట్వీట్‌ చేశారు.
చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ 74వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వైఎస్సార్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. మహానేత జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు కేక్‌ కట్ చేసి.. మహానేత సేవలను స్మరించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement