వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాలు, ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధనకు వైఎస్సార్‌సీపీని స్థాపించడం జరిగిందని.. అందుకు అనుగుణంగా కృషి చేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాను ఎన్నికల తరువాత పాలకులు మర్చిపోయారని మండిపడ్డారు