గత ఏడేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదర్కొని చరిత్ర సృష్టించామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జగన్ ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు. కాంగ్రెస్‌ను ఎదిరించి బయటికొచ్చాక జరిగిన కడప ఉప ఎన్నికల్లో ఐదు లక్షల పై చిలుకు భారీ మెజార్టీతో గెలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.