'మోదీ తన హామీని నిలబెట్టుకోవాలి' | YSR Congress Party Foundation Day Celebrations At Party Office | Sakshi
Sakshi News home page

'మోదీ తన హామీని నిలబెట్టుకోవాలి'

Published Sun, Mar 12 2017 10:55 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

'మోదీ తన హామీని నిలబెట్టుకోవాలి' - Sakshi

'మోదీ తన హామీని నిలబెట్టుకోవాలి'

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తరుణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్రకార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన ఆయన.. భారీగా హాజరైన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన చేసిన వాగ్ధానాలను మరచిపోయిన చంద్రబాబు.. అప్రజాస్వామిక పద్దతుల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని పార్టీలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన గొప్ప విజయం సాధించారని ఆయన అభినందించారు. అయితే.. ప్రధానిపై కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే బాధ్యత ఉందని, తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను ప్రధాని నెరవేర్చాలని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్దతిలోనే చంద్రబాబును ఎదుర్కొదాం అని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement