
ఢిల్లీ: నేడు బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈరోజు ఉదయం 9.00 గం.లకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత.. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
‘బీజేసీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి బారత్ ఓ మాతృక’ అని మోదీ పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు బెంగాలీ మార్కెట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు.
కాగా, లోక్‌సభలో రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించి అత్యధికంగా 303 సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించింది బీజేపీ. ఆర్‌ఎస్‌ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్‌సంఘ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమెర్జెన్నీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా రూపాంతరం చెందింది.
Comments
Please login to add a commentAdd a comment