మీ రాష్ట్రం ధైర్య, సాహసికులను ఇచ్చింది
న్యూఢిల్లీ: మీ రాష్ట్రం ధైర్యం, సాహసం ఉన్నవాళ్లను దేశానికి ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్రను కొనియాడారు. గుజరాత్, మహారాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఆ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాల పాత్ర అద్వితీయమంటూ కొనియాడుతూ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా 1960 మే 1న ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మోదీ మహారాష్ట్రపై అధికంగా ప్రశంసలు గుప్పించారు. దేశాభివృద్ధికి మహారాష్ట్ర సేవల చాలా గొప్పవని అన్నారు.
ఆ నేల ఈ దేశానికి గొప్పగొప్ప తత్వవేత్తలను, మత పెద్దలను, ధైర్యవంతులను, సాహసికులను అందించిందని చెప్పారు. దేశంలో మహారాష్ట్ర ప్రజలకు అత్యధికంగా కష్టపడేతత్వం ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర మరింత గొప్పగా అభివృద్ధి పదాన దూసుకెళ్లాలని తాను మనసారా ఎల్లప్పుడూ కోరుకుంటానని చెప్పారు.