Live Updates
#HBDYSJAGAN: మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: వైఎస్ జగన్
తాడేపల్లి :
- తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పిన వైఎస్ జగన్
- నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..
- అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.
- నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
పెనుకొండలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
- శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
- పార్టీ శ్రేణులతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి శంకర్‌నారాయణ
- అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అనకాపల్లిలో వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
- అనకాపల్లి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మనసాల భరత్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు..
- భరత్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసిన వైఎస్సార్‌సీపీశ్రేణులు.
- అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన మలసాల భరత్
ప్రకాశం జిల్లాలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- ప్రకాశం జిల్లా కంభం కందులాపురం సెంటర్‌లో కుందురు నాగార్జున రెడ్డి అద్వర్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
- కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ కార్యకర్తలు అభిమానులు
- కొండేపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్,మాజీ మంత్రి సురేష్ ఆద్వర్యంలో లో సింగరాయకొండ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసిన మాజీ మంత్రి సురేష్
యర్రగొండపాలెం ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
ప్రకాశం:
- యర్రగొండపాలెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- యర్రగొండపాలెం పట్టణంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు
- కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి సంబరాలు చేసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 1000 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తానేటి వనిత
తూ.గో.జిల్లా:
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ హోంమంత్రి తానేటి వనతి
- భారీ కేక్‌ను కట్ చేసిన తానేటి వనిత
- నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల నుంచి భారీగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
పేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం
కృష్ణాజిల్లా:
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కానూరులో కేక్ కట్ చేసి, 500 మంది పేదలకు దుప్పట్లు, పంపిణీ
- అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, అన్నే శ్రావణ్.
జగ్గయ్యపేటలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా:
- జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజ్ గోపాల్ (చిన్నా )ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు.
- పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు
విజయవాడ సెంట్రల్ వైఎస్సార్‌సీపీ ఆఫీసులో కేక్ కట్ చేసిన మల్లాది విష్ణు
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్‌జగన్ పుట్టినరోజు వేడుకలు
- వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- కేక్ కట్ చేసి వైఎస్‌జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మల్లాది విష్ణు
పూతలపట్టు నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు
- పూతలపట్టు నియోజకవర్గం ఐదు మండలాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
- బంగారుపాళ్యం మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు
- సత్యవేడు మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
- కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గం సమన్వయకర్త నూక తోటి రాజేష్, సీనియర్ నాయకుడు బీరేంద్ర రాజు
అమలాపురం గడియార స్తంభం వద్ద..
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాలో ఘనంగా వేడుకలు
- మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్
- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్, వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు...
- అమలాపురం ఏరియా ఆసుపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు....
ఏలూరు జిల్లా ఉంగుటూరులో..
- ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
- మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండల గ్రామాలలో పలు సేవాకార్యక్రమాల
- ఘనంగా జనహృదయ నేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
రైల్వే కోడూరులో ప్రత్యేక పూజలు
- అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు....
- టోల్గేట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూనమాలవేసి ఘన నివాళులర్పించిన కొరముట్ల శ్రీనివాసులు
- పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు. పేదలకు చీరల పంపిణీ
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కొరముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు
- అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్. పండ్లు అందజేసిన చేసిన కొరముట్ల శ్రీనివాసులు
అల్లూరి జిల్లా పాడేరులో..
- అల్లూరి జిల్లా పాడేరులో ఘనంగా మాజీ సిఎం జగన్ జన్మదిన వేడుకలు
- మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంఎల్ఏ మత్స్యరాస విశ్వేశ్వర రాజు
- వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు
పులివెందులలో వాడవాడలా..
- వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
- పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, మహేష్ మనోహర్ రెడ్డి.
- వైయస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు.
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప.
- పట్టణంలోని వికలాంగుల నెట్వర్క్ కార్యాలయంలో వికలాంగులకు బట్టలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్.
- వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం, అంధుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన వైకాపా శ్రేణులు.
- నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి చేపట్టిన సేవా కార్యక్రమాలు.
అధికారంలో ఉన్నా.. లేకున్నా..
నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేసుకొని నిర్వహించిన మాజీ మంత్రి కాకాణి, రూరల్ ఇంచార్జి అనం విజయ్ కుమార్ రెడ్డి..
వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి.. కేక్ కట్ చేసిన కాకాణి, విజయ్ కుమార్ రెడ్డి..
మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..
- జగన్ అధికారం కోల్పోవడంతో రాష్టానికి అరిష్టం పట్టిందని ప్రజలు అంటున్నారు..
- కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న జగన్ పుట్టినరోజుకి క్యాడర్ భారీగా వచ్చారు..
- జగన్ పరిపాలనను అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు.. మరోసారి అయన అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
- 2029 డిసెంబర్ 21న జగన్ ముఖ్యమంత్రిగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఖాయం..
అనం విజయ్ కామెంట్స్..
- - అధికారంలో ఉన్నా.. లేకున్నా.. జగన్ నిత్యం జనంలోనే ఉన్నారు..
- - సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక సీఎం జగన్..
- - చంద్రబాబుకి ఓటేసి.. తప్పు చేశామనే భావన జనాల్లో కనిపిస్తుంది..
- - పదవి లేకపోయినా.. వాడ వాడలా జగన్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి..
ఆత్మకూరు అన్నిగ్రామాల్లో ఘనంగా వేడుకలు..
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- ఆత్మకూరు మేకపాటి క్యాంపు కార్యాలయంలో 52 కిలోల భారీ కేకును కట్ చేసిన కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య మరియు పట్టణ వైసీపీ నాయకులు.
- నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిన అభిమానులు నాయకులు.
- పట్టణంలో జిల్లా వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు.
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ లో భారీ కేక్
- వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
- ఎమ్మెల్సీ డిసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు కలిసి భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి
- కాకినాడ జిల్లా జగ్గంపేటలో వేడుకలు
- మెయిన్ రోడ్డులో తొలుత దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులు
- కేక్ కట్ చేసి జగన్ బర్త్‌డే వేడుకలు నిర్వహించిన జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహం.
- కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయం లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
- కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు.
- అనాధ,వృద్దశ్రమంలో పండ్లు పంపిణీ
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వేడుకలు
- ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వేడుకలు
- మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు.
- పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు.
కాకినాడ సామర్లకోట కార్యాలయంలో..
- కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- కేక్ కట్ చేసిన పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,పేదలకు దుప్పట్లు పంపిణీ.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో..
- తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..
- కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమం చేసిన సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ దబ్బల శ్రీమంత రెడ్డి
- వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు
కాకినాడ తునిలో..
- కాకినాడ జిల్లా తునిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా,యనమల కృష్ణుడు.
జగన్‌కు పోరాటాలు కొత్తేం కాదు.. తిరుపతి నేతలు
తిరుపతి టి. ఎం.ఆర్. కళ్యాణ మండపంలో సర్వ సభ్య సమావేశం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జీ, కామెంట్స్..
- తిరుపతి నగరంలో మనం చేసిన అభివృద్ధి అడుగు అడుగునా కనిపిస్తున్నాయి
- నన్ను నేను మార్చు కోవడానికి నేను సిద్ధం..
- సిఎం చంద్రబాబు సుపర్ సిక్స్ లో భాగంగా ఉచిత బస్సు అన్నారు, ఇప్పటికీ అమలు కు నోచుకోలేదు.
- తిరుపతి లో మన పాలనలో డబుల్ డెక్కర్ బస్సు ఉచితంగా అందుబాటులోకి తీసుకు వచ్చాము,
- తిరుపతి నగరంలో ఇంతటి అభివృద్ధి ఎక్కడ జరగ లేదు
డాక్టర్.ఏం.గురుమూర్తి, తిరుపతి ఎంపీ కామెంట్స్...
- బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం
- ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రతి పార్టీ పార్లమెంట్ లో బ్యాలెట్ పేపర్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు
- వైఎస్ జగన్ అన్న కూడా బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కోరుతున్నారు
- సాంకేతికంగా ఓడి పోయాము, నైతికంగా గెలిచాము
- ఎలాంటి పొరబాట్లు లేకుండా రానున్న ఎన్నికల్లో గెలుస్తాం
- ప్రాణవాయువు లాంటి కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కు ఉన్నారు
- లక్ష ఓట్లు మెజారిటీ తో వచ్చే ఎన్నికల్లో అభినయ్ రెడ్డి గెలుస్తారు, జగన్ మోహన్ రెడ్డి ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం
డాక్టర్..శిరీష, తిరుపతి మేయర్ కామెంట్స్
- జగన్ అన్న అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రచారంలో మనం వెనుకబడి పోయాము
- భూములు కోల్పోయిన వారికి పది రేట్లు భూములు విలువ పెరిగింది.
- ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలిపి వేశాయి
- రైతులకు 20 వేల పెట్టుబడి ఇస్తామని ఇస్తామని మోసం చేశారు చంద్రబాబు
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజనరీ లీడర్, కరోనా సమయంలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే నిజమయ్యింది
- కరోనా విపత్తు సమయంలో, వరద సమయంలో సమర్థ వంతంగా నిర్వహించారు..
- దేశానికి ఆదర్శంగా నిలిచారు జగన్ మోహన్ రెడ్డి
డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ కామెంట్స్
- కూటమి ప్రభుత్వం ఈ ఆరునెలలు పాలనలో ప్రజలు పూర్తిగా విసిగి పోయారు
- సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అమలు కావడం లేదు
- అభివృద్ధి కార్యక్రమాలు ,సంక్షేమపాలన అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుంది
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావడం ఖాయం, జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం.
భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు
- పోరాటాలు తో పుట్టింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
- ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించారు
- మూడున్నర లక్షల కోట్లు నేరుగా ప్రజలు కు అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి
- మోసం తో అధికారంలోకి వచ్చారు, మోసపూరిత హామీలు ఇచ్చారు
- పేద ప్రజలను అధికార మధం తో పేద ప్రజల్ని తొక్కుతున్నారు..
- ఆరు నెలల్లో పోరాటాలు చేస్తూ రోడ్ల పైకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
- 2019 ఎన్నికల్లో ఓడి పోయి , మూడేళ్లు వరకు ప్రజల్లోకి రాలేక పోయాడు చంద్రబాబు,
- జగన్ మోహన్ రెడ్డి ఓటమి తర్వాత 15 రోజుల్లోనే ఢిల్లీ నడి వీధుల్లో పోరాటం చేశారు
- గత ఐదేళ్లుగా ఎవరి మనసు నొప్పించి ఉంటే క్షమించమని కోరుతున్నా, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో కలిసి పనిచేద్దాం
ప్రజల మద్దతుతో జగన్ మళ్లీ సీఎం: చెవిరెడ్డి
- ప్రకాశం జిల్లాలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- జిల్లా కేంద్రం ఒంగోలు వైఎస్ఆర్సిపీ కార్యాలయం వద్ద కోలాహలం
- పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
- జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ చుండూరి రవిబాబులు హాజరు
- కేక్ కట్టింగ్ అనంతరం ప్రసంగించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- పేదల పక్షపాతి, సంక్షేమ సారధి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
- ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు
- కార్యకర్తలు ఆ దిశగా శ్రమించాలి
- వేలాదిమంది పేద మహిళలకు చీరల పంపిణీ
- పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో
- పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వేడుకలు
- వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు
- పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసిన వడ్డి రఘురామ్
అనంతలో పేదలకు బట్టల పంపిణీ
- అనంతపురం జిల్లాలో జగన్ పుట్టినరోజు వేడుకలు
- వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు,
- వృద్ధాశ్రమం, అనాధాశ్రమాల్లో అన్నదానం పేదలకు,దుప్పట్లు చీరలు పంపిణీ..
విజయవాడ: జగన్ పాలన కోసం ఎదురుచూపులు
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా
అన్నదానం నిర్వహించి , కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన మేయర్
విజయవాడ నగర మేయర్ , రాయన భాగ్యలక్ష్మి
- జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- నిండు నూరేళ్లు జగనన్న సంతోషంగా ఉండాలి
- ఆరున్నర నెలల్లోనే కూటమి పాలన పై ప్రజలు విసిగిపోయారు
- అనవసరంగా కూటమికి ఓటేశామనే భావనలో ప్రజలు ఉన్నారు
- జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద..
- తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద జగన్ పుట్టిన రోజు వేడుకలు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాయలసీమ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు
- కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్లోన్న విద్యార్థి సంఘం నాయకులు
విశాఖ: జగన్ బర్త్‌డే.. రక్తదానంలో అమర్నాథ్
- విశాఖ వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు.
- రక్తాన్ని డొనేట్ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
- మానసిక వికలాంగుల సమక్షంలో కేక్ కట్ చేసిన 51 వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ
- వెంకటరమణ ఆధ్వర్యంలో వృద్ధులకు పిల్లలకు దుస్తులు పళ్ళు పంపిణీ
పిఠాపురంలో జన్మదిన వేడుకలు
- కాకినాడ జిల్లా పిఠాపురం లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
- పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా
- అనాధశ్రమంలో పండ్లు, దుప్పట్లు పంపిణీ
కాకినాడ జిల్లా జగ్గంపేటలో..
- జగ్గంపేట కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
- కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
కర్నూలు జిల్లా మంత్రాలయంలో..
- రాంపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.
కృష్ణా జిల్లావ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
- తోట్లవల్లూరు (మ) తోట్లవల్లూరు గ్రామంలో జగన్ జన్మదిన వేడుకలు
- పాల్గొన్న మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్
- పెడన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వేడుకలు జరిపిన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక
- పెడన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ
- గన్నవరం ఎస్సి కాలనీలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండి.గౌసాని ఆధ్వర్యంలోవేడుకలు.
- కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన పార్టీ నేతలు
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో..
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి
‘జగన్‌ను మరలా సీఎంను చేసుకుంటాం’
- ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి వేడుకలు జరిపిన నియోజకవర్గ ఇన్ చార్జి జయప్రకాష్
- పాల్గొన్న కార్పొరేటర్లు,మాజీ డిప్యూటీ మేయర్లు, పార్టీ శ్రేణులు
ఏలూరు నియోజకవర్గ ఇన్ చార్జి జయ ప్రకాష్ కామెంట్స్
- జగనన్నను ముఖ్యమంత్రినీ చేసుకోక.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు
- జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి పేదలకు ఒక సంక్షేమ పథకం అమలు చేసేవారు
- చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రజలను మంచేశారు
- చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అభివృద్ది జరిగింది శూన్యం
- జగన్మోహన్ రెడ్డి నీ అందరూ మరలా ముఖ్యమంత్రి నీ చేసుకుంటాం ..
కార్పొరేటర్ల కామెంట్స్
- జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు
- పేదల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి జగన్ ఒక్కరే
- జన హృదయ నేత అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే
- తండ్రి ఆశయాలు పనికి పుచ్చుకున్న నాయకుడు కూడా ఆయన ఒక్కరే
- ఈరోజు మాజీ అయితే కావచ్చు కానీ జన హృదయాలలో ఎప్పుడూ జగనన్న హీరోనే
హైదరాబాద్ కూకట్‌పల్లిలో..
- కూకట్‌పల్లిలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- భారీగా బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- పాల్గొన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు
- నిన్న అర్ధరాత్రి పంజాగుట్ట, కేబీహెచ్‌బీలోనూ పుట్టినరోజు వేడుకలు
శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT
— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024
తాడేపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్: వైఎస్సార్‌సీపీ నాయకులు
- తాడేపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- జగనన్న జన్మదిన వేడుకల కార్యక్రమం నిర్వహించిన పార్టీ కీలక నేతలు
- పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
- జగన్ ఒక రియల్ విజనరీ: సజ్జల
- అరుదైన నేతల్లో ఒకరు: సజ్జల
- జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు: సజ్జల
- ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా జగన్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు: సజ్జల
- ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు: సజ్జల
- జగన్ ఐదేళ్ల పాలనను.. కూటమి ఆర్నెల్లతో పోల్చి చూడండి.: సజ్జల
- పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్: సజ్జల
- కార్యాలయం బయట కోలాహలం: సజ్జల
- పార్టీ జెండాలతో.. జగన్ అనుకూల నినాదాలతో నృత్యాలు చేసిన పార్టీ శ్రేణులు: సజ్జల
తిరుపతి జిల్లా పెళ్లకూరులో..
- చిల్లకూరు గ్రామంలో మాజీ మాజీ ఎన్ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
- వేడుకల్లో పాల్గొని నాయకులతో కలసి భారీ కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
- రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది : కిలివేటి సంజీవయ్య
- దీపం ఉండగానె ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ దోచుకుంటున్నారు: కిలివేటి సంజీవయ్య
- ప్రస్తుత కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది: కిలివేటి సంజీవయ్య
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ..
- జమ్మలమడుగులో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
- ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు
- పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు
కృష్ణాజిల్లా అవనిగడ్డలో..
- అవనిగడ్డ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జగన్ బర్త్‌డే వేడుకలు
- కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
- అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసిన సింహాద్రి వికాస్ జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో..
- కమలాపురం లో ఘనంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న పార్టీ ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి
- కమలాపురం స్థానిక అనాధ క్షేత్రాలయంలో అనాధ బాలల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు.
- అనాధ బాలలకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన జెడ్‌పీటీసీ సుమిత్రా రాజశేఖరరెడ్డి
- స్థానిక పార్టీ కార్యాలయం వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నరేన్ రామాంజుల రెడ్డి.
- స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన పార్టీ శ్రేణులు.
అనంతపురం ఉరవకొండలో..
- ఘనంగా మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
- పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు వై. ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు
- కేక్ కట్ చేసి సంబరాలు.. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ.
అనకాపల్లి పరవాడలో..
- పరవాడలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
- వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు
- ఎలమంచిలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో వేడుకలు
- అచ్యుతాపురం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్న కార్యకర్తలు, అభిమానులు
- అచ్చుతాపురం వికలాంగుల ఆశ్రమంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు, అచ్చుతాపురం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్ల పంపిణీ
- మాజీ డీసీసీబీ చైర్మన్ యు సుకుమార్ వర్మ నేతృత్వంలో కార్యక్రమాలు
- హాజరైన అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షుడు దేశం శెట్టి శంకర్రావు, ఎంపీపీ కోన బుజ్జి తదితరులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో..
- రాజమండ్రిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
- రాజమండ్రి వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ కార్యాలయంలో కేక్ కట్టింగ్ సంబరాలు
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు
- హాజరైన పార్టీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆకులు వీర్రాజు తదితరులు
అనంతలో భారీ కేక్ కట్టింగ్
- అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
- వైఎస్సార్ సీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి,
- పాల్గొన్న ఎమ్మెల్సీ మంగమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో..
- భీమవరం చిన్న పేటలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత జక్రి ఆధ్వర్యంలో జగన్ బర్త్‌డే వేడుకలు
- జన్మదిన కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అభిమానులు
- పాల్గొన్న భీమవరం పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పార్టీ శ్రేణులు
- ఉండి మండలం వాండ్రం గ్రామంలో వేడుకలు
- పార్టీ మండల అధ్యక్షులు పివి ఆర్కే, ఆంజనేయరాజు ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు.
- వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ
వైఎస్ఆర్ జిల్లా కడప కేంద్రంలో..
- కడపలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
- మైనార్టీ నాయకుడు రహీమ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం
- జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు
అన్నమయ్య జిల్లా రాజంపేటలో..
- రాజంపేటలో ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
- ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి నేతృత్వంలో వేడుకల నిర్వహణ
- పాతబస్టాండ్ కూడలిలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఆకేపాటి అమరనాథరెడ్డి
- పేదలకు అల్పాహార విందు అందజేత
- జగన్ బర్త్‌డే సందర్భంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్రి రవికుమార్, పట్టణ వైసిపి అధ్యక్షులు జేవి. కృష్ణ రావ్ యాదవ్ తదితరులు
విజయవాడ: ప్రజల మధ్యే వేడుకలు
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
- పశ్చిమ నియోజకవర్గం భవానిపురం శ్రీ వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసిన వైస్సార్సీపీ నేత పోతిన మహేష్
- ఉదయం అల్పాహారం మరియు రాత్రికి భోజన ఏర్పాట్లు
- నిత్యం ప్రజలతోనే మమేకమయ్యే నేత వైఎస్ జగన్: పోతిన
- అందుకే ఆ ప్రజల మధ్యనే ఈ వేడుకలు: పోతిన
కర్నూలులో..
- జగన్ పుట్టినరోజు వేడుకల్లో.. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,
- 40వ వార్డు లో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు చీరలు అందజేత
- హాజరైన కార్పొరేటర్ విక్రమ్ సింహా రెడ్డి, పార్టీ ఇతర నాయకులు
- కర్నూల్ బిర్లా గేట్ వద్ద వేడుకల్లో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ గ్రంధాల చైర్మన్ సుభాష్ చంద్రబోస్
- కర్నూలులో జగనన్న జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్, కార్పొరేటర్లు, తదితరులు
గుంటూరు పొన్నూరులో..
- పొన్నూరులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
- లూధరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసిన పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
ఆర్కే రోజా విషెస్
- వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా విషెస్
- పేద బిడ్డలు ప్రపంచంతో పోటీ పడాలని ఆశించిన జగనన్న: ఆర్కే రోజా
- ఆ దిశగా తన ఐదేళ్ల పాలనలో సంస్కరణలు: ఆర్కే రోజా
- ఎక్స్ ఖాతాలో రోజా పోస్ట్
పేద బిడ్డలు ప్రపంచంతో పోటీపడాలని ఆశిస్తూ.. విద్యా సంస్కరణలతో ఆ దిశగా ఐదేళ్లు అడుగులు వేయించిన @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HBDYSJagananna pic.twitter.com/xJSgYBQgzz
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2024
వైఎస్సార్ జిల్లాలో..
- ఘనంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
- భాకరాపురంలోని వైయస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేత వైయస్ మనోహర్ రెడ్డి.
- డిగ్రీ కళాశాల రోడ్డులో గల బాలికల వసతి గృహంలో కేక్ కట్ చేసిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రుక్మిణి దేవి.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు
- నేడు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
- రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ
- కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- పేదలకు దుస్తుల పంపిణీ చేయనున్న పార్టీ నేతలు