
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్‌తో సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

Comments
Please login to add a commentAdd a comment