నేడు జిల్లాలో ఎంపీ పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఉదయం 11 గంటలకు మధిర మండలంలోని దేశినేనిగూడెం, కుర్నవల్లి, తల్లాడ, వైరా గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ డే వేడుకలకు హాజరవుతారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. అలాగే ఖమ్మం నగరంలో జరిగే వివాహ వేడుకలకు ఎంపీ హాజరవుతారు.