ఈడ్చి పారేశారు.. | Muncipal Employees Dharna at CM Camp office in Vijayawada | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 18 2015 6:51 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

విజయవాడ బ్యూరో: కడుపుమండి కదం తొక్కిన మున్సిపల్ కార్మికులపై ఖాకీలు క్రౌర్యం ప్రదర్శించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలన్న ప్రయత్నాన్ని భగ్నంచేసి దొరికినవారిని దొరికినట్టు వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. మహిళలనే కనికరం చూపకుండా పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చిపారేశారు. పోలీసుల ప్రతాపానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, బొచ్చు సుబ్బలక్ష్మి మరో ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వేలాదిమంది మున్సిపల్ కార్మికులు శుక్రవారం విజయవాడకు తరలివచ్చి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లీలామహల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న కార్మికుల్ని, జేఏసీ నేతలపై పోలీసులు ఒక్కసారిగా దాడిచేశారు. వేలమంది కార్మికులను అరెస్టు చేసి వన్‌టౌన్, ఇబ్రహీంపట్నం, భవానీపురం, కృష్ణాలంక, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement