జిల్లాలో నేటి నుంచి పొంగులేటి పర్యటన
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
అనంతరం కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నపురెడ్డిపల్లిలో నిర్వహించనున్న పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.