కేసీఆర్ ను వెంటాడుతున్నవాస్తు దోషం!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వాస్తు దోషాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. వాస్తు లోపాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి కేసీఆర్ మారుతున్నట్టు ఆధికారులు మీడియాకు వెల్లడించారు. క్యాంప్ ఆఫీస్ ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుత క్యాంప్ ఆఫీస్ ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ మారడం ఇది రెండవసారి.