Vaastu Effect
-
వాస్తు కోసం పోలీస్ స్టేషన్ గది కూల్చివేత
బి.కొత్తకోట : వాస్తు దెబ్బకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ భవనంపై గది కూలిపోయింది. మండల పరిధిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలతో ఏదో వాస్తులోపం ఉందని భావించారు. వాస్తు రీత్యా స్టేషన్ భవనంపై ఉన్న గది ఉండకూదని గ్రహించారు. మంగళవారం ఆ గదిని కూల్చేశారు. వాస్తవంగా ఈ గది పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణంలో భాగం కాదు. 1980లో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించగా, 1992లో గది నిర్మించారు. 1980 దశాబ్దంలో పీపుల్స్‌వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) చరిత్రలో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఉన్న గుర్తింపు ఏ ప్రాంతానికీ లేదు. పీపుల్స్‌వార్ వెలుగు వెలిగిన కాలంలో తంబళ్లపల్లె కార్యకలాపాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతోపాటు ఉద్రిక్తతలు, సంచలన సంఘటనలు జరిగాయి. వార్ కదలికలు అధికంగా ఉండటం, తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లకూ భద్రత కలి్పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మదనపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న బి.కొత్తకోట, ముదివేడు, తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం పోలీస్స్టేషన్లపై పీపుల్స్‌వార్ దళాలు దాడులు చేస్తే తిప్పికొట్టడం కోసం రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ భవనంపై ఓ గదిని నిర్మించి అందులో ఇసుక బస్తాలు వేసి, సాయిధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. 24 గంటలు గది నుంచి పహారా ఉండేది. స్టేషన్ల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎవరైనా నేరుగా స్టేషన్లోకి వచ్చే వీలులేకుండా కంచెతో పలు వలయాలను నిర్మించారు. ఇలా చేయడం ద్వారా నక్సల్స్‌ను స్టేషన్లలోకి దూసుకురాకుండా నివారించడం, పై గదిలో పహారా కాస్తున్న సాయుధ బలగాలు నిలువరించడం సాధ్యమవుతుందని ఇలా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అంటే 1992–93లో బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌పై ఈ గది నిర్మించారు. అప్పుడు నిర్మించిన గది 2000 వరకు ఉపయోగంలో ఉండగా, అనంతర పరిణామాలతో పీపుల్స్‌వార్ కనుమరుగు కావడంతో నిఘా, కంచెను తొలగించారు. అప్పటి నుంచి వృథాగా ఉన్న ఈ గది ఇప్పుడిలా వాస్తు దెబ్బకు కూలిపోయింది. -
ఏపీ అసెంబ్లీ భవనానికి వాస్తుదోషం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాస్తు దోషం వదిలేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ భవనానికి మార్పులు, చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాస్తు దోషం అంటూ సచివాలయంలో పలు మార్పులు చేర్పులు చేసిన సర్కార్.. అసెంబ్లీ భవనానికి మార్పులు చేయనుంది. వాస్తు కోసం సచివాలయం వైపు అధికారులు ...కొత్త గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఐదు గేట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఆరో గేటు నిర్మిస్తున్నారు. సచివాలయంలో వాస్తు దోషం కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూటు మార్చుకుని వెళుతున్న విషయం విదితమే. అంతేకాకుండా సచివాలయంలో పలు గోడలు, నిర్మాణాలు పగులగొట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ టీడీపీ సర్కారుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ ప్రారంభం తొలి రోజే ఇలా జరగడంతో టీడీపీ శ్రేణులు అపశకునం ఎదురైనట్లు చర్చించుకున్నారు. దీంతో అసెంబ్లీకి వాస్తు దోషాలు ఉన్నట్లు గుర్తించి మార్పులు చేస్తున్నారు. సచివాలయం వైపు ఆరో గేటు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా ఏం మార్పులు చేస్తుందో చూడాలి. -
కేసీఆర్‌కు వాస్తు భయం!
-
కేసీఆర్ ను వెంటాడుతున్నవాస్తు దోషం!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వాస్తు దోషాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. వాస్తు లోపాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి కేసీఆర్ మారుతున్నట్టు ఆధికారులు మీడియాకు వెల్లడించారు. క్యాంప్ ఆఫీస్ ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్ ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ మారడం ఇది రెండవసారి.