సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్యాంపు కార్యాలయం ఉండగా.. దాన్ని కూల్చేసి కొత్త క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడమేంటని మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కొత్త క్యాంపు ఆఫీసులోకి ప్రవేశించే ముందే పేదలకు నిర్మించి ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇళ్ల సంగతిని తేల్చాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించొద్దంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.